టాటా మోటార్స్ (Tata Motors) అత్యంత ప్రజాదరణ పొందిన మైక్రో SUV 'టాటా పంచ్' (Tata Punch) ఇప్పటికి 32,000 యూనిట్లు అమ్మబడ్డాయి. టాటా కంపెనీ నుంచి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఎక్కువమంది కష్టమర్లను ఆకర్షించడంలో ఇది మంచి విజయం సాధించింది. దీనికి సంబంధించి సమాచారం టాటా కంపెనీ తెలియజేసింది.ఇక టాటా కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, గత నాలుగు నెలల్లో రెండుసార్లు 10,000 యూనిట్ల నెలవారీ అమ్మకాల మార్కును అధిగమించినట్లు తెలిసింది. అదే టైంలో ఇప్పటికి అందుబాటులో ఉన్న ఈ విభాగంలోని ఇతర మోడల్స్ కంటే కూడా ఈ టాటా పంచ్ అమ్మకాల్లో ముందంజలో ఉంది.ఇక టాటా పంచ్ అనేది ఇప్పుడు కస్టమ్ ప్యాక్‌తో అందించబడిన రెండవ టాటా మోటార్స్ కంపెనీ కారు. కావున కొనుగోలుదారులకు ఇష్టమైన యాక్సససరీస్ కూడా ఇందులో పొందవచ్చు. వీటి ధర రూ.30,000 నుంచి రూ.45,000 దాకా ఉంటుంది. ఇది ఈ కారును మరింత ఆకర్షణీయంగా చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది.
ఇక అంతే కాకుండా ఇవి వాహన వినియోగదారులకు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి.ఇక టాటా పంచ్ ధర వచ్చేసి ఇప్పుడు రూ. 5.64 లక్షల నుండి ప్రారంభమవుతాయి (ఎక్స్-షోరూమ్, ఇండియా). టాటా పంచ్ మైక్రో-SUV కార్ బేస్ 'ప్యూర్' వేరియంట్ ధర ఇప్పుడు రూ. 15,000 దాకా పెరిగింది. అయితే ఇందులో అన్ని వేరియనట్ల ధరలు అనేవి ఇంకా పెరగలేదు. కాబట్టి కానీ టాటా పంచ్ టాప్-ఎండ్ 'క్రియేటివ్' ట్రిమ్ స్థాయి ధరలు రూ. 11,000 తగ్గాయి. ఇంకా అలాగే క్రియేటివ్ ట్రిమ్ స్థాయికి కొత్త ధరలు ఇప్పుడు మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్ కోసం రూ. 8.38 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) నుండి స్టార్ట్ అవుతాయి.ఇక అదే సమయంలో AMT వేరియంట్ ధర వచ్చేసి రూ. 8.98 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). మిగిలిన ట్రిమ్స్ అన్ని కూడా ఇప్పుడు రూ. 10,000 వరకు పెరిగడం అనేది జరిగింది. ఇక Tata Punch మైక్రో SUV కంపెనీ కొత్త ఎజైల్ లైట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్డ్ (ALFA) ఆర్కిటెక్చర్‌పై ఆధారపడటం అనేది జరిగింది.