త్వరలో ఇండియన్ మార్కెట్లోకి 'Pravaig' ఎలక్ట్రిక్ కార్.. వివరాలు..

Purushottham Vinay
ఇండియాకి చెందిన బెంగుళూరుకు సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ కంపెనీ Pravaig Dynamics (ప్రవైగ్ డైనమిక్స్) గత కొంత కాలంగా తన ఫస్ట్ ఎలక్ట్రిక్ కారును తయారుచేయడంలో పూర్తిగా నిమగ్నమై వున్న ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ కంపెనీ ఎలక్ట్రిక్ కార్ ఇప్పటికే చాలా సార్లు రోడ్లపై టెస్టింగ్ సమయంలో కనిపించడం జరిగింది. Pravaig Dynamics ఎలక్ట్రిక్ కారు, లేటెస్ట్ ఫీచర్స్ ఇంకా అలాగే లేటెస్ట్ పరికరాలను కూడా కలిగి ఉంటుంది. అయితే ఈ కంపెనీ ఈ కారుని పూర్తిగా మన ఇండియాకి సంబంధించిన ఉత్పత్తులతో తయారు చేస్తుంది. ఇక ఇది అధునాతన లక్షణాలు కలిగిన ఇండియన్ సూపర్ లగ్జరీ కారు కానుంది.ఇక Pravaig Dynamics కంపెనీ ప్రణాళిక ప్రకారం కనుక చూసినట్లయితే తన ఫస్ట్ ఎలక్ట్రిక్ కారుని 2022వ సంవత్సరంలో విడుదల చేయనుంది. అంతే కాకుండా ఈ కంపెనీ 2022 వ సంవత్సరంలో దాదాపు 2,500 కార్లను అమ్మాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది.ఇక అదే ప్రణాళికలో 2023వ సంవత్సరం నాటికి ఒక లక్ష కార్లను ఇంకా అలాగే 2025 వ సంవత్సరం నాటికీ మిలియన్ ఎలక్ట్రిక్ కార్లను అమ్మడానికి ప్లాన్ చేస్తుంది.

ఇక 2022 వ సంవత్సరంలో కేవలం 2,500 మాత్రమే ఎందుకు అమ్ముతుంది అంటే, ఇది మొదట టాక్సీ ఆపరేటర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ స్పష్టం చేయడం జరిగింది. అంటే ఈ కంపెనీ దీన్ని ఫస్ట్ దశలో టాక్సీగా నడపబోతోంది.ఇక ఫేజ్ 2 లో ఇది ప్రైవేట్ కస్టమర్లకు అందుబాటులోకి రానుంది.కాబట్టి మొదటి దశలో అటానమస్ లెవల్ 2 సామర్థ్యం అనేది దీనికి ఇవ్వబడుతుంది.ఇక అంతే కాకుండా ఫేజ్ 2 నాటికి కూడా దీని సామర్ధ్యం అనేది మరింత మెరుగు పడుతుంది. ఇక అప్పటికి ఇందులో అనేక అప్డేట్స్ వస్తాయని కంపెనీ తెలిపడం జరిగింది.ఇక ఒక లగ్జరీ ఎలక్ట్రిక్ కారును టాక్సీగా అందుబాటులోకి తీసుకురానున్న మొట్ట మొదటి కంపెనీ మన ఇండియాకి చెందిన ఈ Pravaig Dynamics. ఇక ఈ కంపెనీ టాక్సీ కార్లను కస్టమర్ Pravaig యాప్ ద్వారా ఈజీగా బుక్ చేసుకోవచ్చు. అలాగే ఇది చాలా ఆధునిక సాంకేతికతలు కలిగి ఉన్న లగ్జరీ ఎలక్ట్రిక్ కారు కాబోతుంది.ఇక ఈ ఎలక్ట్రిక్ కారు మెర్సిడెస్ బెంజ్ వంటి పెద్ద ఫేమస్ కంపెనీల వాహనాలకి  కూడా పెద్ద పోటీగా నిలువనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: