సేఫ్టీ కార్లకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న టాటా కంపెనీ..

Purushottham Vinay
ఇండియా ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్  బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ 
ను సొంతం చేసుకున్న తర్వాత నుండి కూడా ఇరు కంపెనీల ఉత్పత్తులు ఇంకా వ్యాపారణంలో గణనీయమైన అభివృద్ధి అనేది కనబడింది.ఇక బ్రిటీష్ ఇంజనీర్ల సహాయంతో టాటా మోటార్స్ ఇటీవలి కాలంలో ఇండియాలో అత్యుత్తమ కార్లను విడుదల చేయడం జరిగింది.ఇండికా, ఇండిగో, ఆరియా వంటి కార్ల తరువాత టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్, నెక్సాన్ ఇంకా హారియర్ వంటి కార్ల పరిచయంతో కంపెనీ ఓ కొత్త శ్రేణి కార్లను భారతదేశంలోని వినియోగదారులకు పరిచయం చేయడం జరిగింది.టాటా మోటార్స్ నుండి వచ్చిన ఈ కొత్త మోడళ్లన్నీ కూడా డిజైన్, టెక్నాలజీ, ఫీచర్స్ ఇంకా అలాగే సేఫ్టీ పరంగా మునుపటి మోడళ్ల కన్నా కూడా ఎన్నో రెట్లు అడ్వాన్స్డ్‌గా ఉన్నాయి.

ఇక ఈ కంపెనీ తమ వాహనాల నాణ్యత విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా హై క్వాలిటీతో తయారు చేస్తుంది. పైగా ఇప్పుడు ఈ టాటా కంపెనీ దేశంలోనే అత్యంత సురక్షితమైన కార్లని తయారు చేస్తున్న బ్రాండ్‌గా నిలుస్తుంది.ఇక ఈ కంపెనీ నుండి లభిస్తున్న నెక్సన్ ఎస్‌యూవీ కార్ , గ్లోబల్ ఎన్‌క్యాప్  క్రాష్ టెస్టులో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందడం జరిగింది.ఇండియా మార్కెట్లో అత్యంత సురక్షితమైన కార్లలో బెస్ట్ ఛాయిస్‌గా ఈ కార్ కూడా ఇప్పుడు కొనసాగుతోంది. తాజాగా టాటా కంపెనీ ప్రవేశపెట్టిన టాటా టిగోర్ ఈవి కూడా అదే గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొంది సేఫ్టీ కార్ గా మార్కెట్ లో నిలిచింది.ఇక దీన్నిబట్టి తెలిసిందేంటంటే , టాటా మోటార్స్ ధృడమైన కార్లకు కేరాఫ్ ఆడ్రస్‌గా మారుతున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ నుంచి వచ్చిన రెండవ ఇంకా లేటెస్ట్ ఎలక్ట్రిక్ కార్ టిగోర్ ఈవి కోసం గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. ఇక ఈ క్రాష్ టెస్టులో టిగోర్ ఈవి కార్ మొత్తం 5 స్టార్లకు గాను 4 స్టార్ల రేటింగ్‌ను దక్కించుకొని, ఎంతో సురక్షితమైన కారుగా నిలవడం జరిగింది. ఇంకెందుకు ఆలస్యం సేఫ్టీ కార్ కొనాలనుకునేవారు టాటా కార్లని కొనుగోలు చెయ్యండి. సురక్షితంగా వుండండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: