టాటా సఫారీ సెన్సేషనల్ రికార్డ్..

Purushottham Vinay
ఇక ఇండియాలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'టాటా మోటార్స్' తన న్యూ జనరేషన్ టాటా సఫారిని ఈ సంవత్సరం ఫిబ్రవరి 22 వ తేదీన ఇండియా మార్కెట్లో అధికారికంగా విడుదల చేయడం జరిగింది. ఇక ఇది ఇండియన్ మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే ఈ టాటా సఫారి మంచి ప్రజాదరణ పొందడం జరిగింది. ఇక ఈ 6/7 సీట్ల ఎస్‌యూవీ యొక్క ఉత్పత్తి ఇప్పుడు ఏకంగా 10,000 యూనిట్లు పూర్తయినట్లు టాటా కంపెనీ సమాచారం అందించడం జరిగింది.ఇక తాజాగా అందిన నివేదికల ప్రకారం కంపెనీ తన 10,000 వ యూనిట్‌ను పూణే సిటీలోని తన తయారీ కర్మాగారం నుండి విడుదల చేయడం జరిగింది.ఇక టాటా సఫారి మొదటి 100 యూనిట్లు ఫిబ్రవరి నెలలో ప్రొడ్యూస్ చేయకపోగా, ఇక మిగిలిన 9,900 యూనిట్లు కొత్త సఫారీ కారులను కంపెనీ మార్చి, ఏప్రిల్, మే ఇంకా జూన్ చివరి నాలుగు నెలల మధ్య ప్రొడ్యూస్ చేసినట్లు తెలిపడం జరిగింది.

ఇక కొత్త టాటా సఫారీ కొత్త ఎస్ యూవి కార్ యొక్క 10,000 యూనిట్లను ప్రొడ్యూస్ చేసిన సందర్భంగా, ఇక టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర మాట్లాడుతూ 'నాలుగు నెలల వ్యవధిలో కొత్త సఫారీల కోసం ఈ ముఖ్యమైన మైలురాయిని చేరుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు.ఇక అంతే కాకూండా దేశ చరిత్రలోనే ఒక క్లిష్ట పరిస్థితిలో కూడా ఈ రికార్డ్ సాధించగలగడం జరిగింది.ఇక టాటా సఫారి యొక్క 10,000 యూనిట్లు ఉత్పత్తికి యాజమాన్యం ఎంతగానో కృషి చేయడం జరిగింది. ఇక ఈ కృషికి నిదర్శనమే ఈ 10,000 వ టాటా సఫారీ అని ఆయన తెలిపారు.ఈ కొత్త టాటా సఫారి 6 ఇంకా 7 సీట్ల కాన్ఫిగరేషన్లలో అందించబడుతుందట.ఇక టాటా మోటార్స్ యొక్క కొత్త టాటా సఫారి కార్ తన విభాగంలో ఎక్కువగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలలో ఒకటి అని,ఇక ఈ విభాగంలో ప్రస్తుత మార్కెట్ వాటా వచ్చేసి 25.2% ఉందని కంపెనీ తెలియజేయడం జరిగింది.ఇక దీనిని బట్టి చూస్తే, మార్కెట్లో ఈ ఎస్‌యూవీ కార్ కి ఎంత ఆదరణ ఉందో స్పష్టంగా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: