అదిరిపోయే బైక్.. లీటర్‌ ఖర్చుతో 800 కి.మీ ప్రయాణం..!

Chakravarthi Kalyan
ఓవైపు పెట్రోల్‌ రేట్లు మండిపోతున్నాయి. లీటర్‌ పెట్రోల్‌  సెంచరీ దాటేసింది. ప్రయాణాలు ఖరీదయ్యాయి. కానీ వేరే మార్గం లేదు. ఇక ఎలక్ట్రిక్ బైక్‌లు వచ్చినా.. వాటికీ కొన్ని పరిమితులు ఉన్నాయి. పదే పదే చార్జింగ్ చేయాల్సి రావడం.. ఎక్కువ దూరం పోవాలంటే ఇబ్బందులు తప్పవు. ఇందుకు పరిష్కారంగా ఓ మంచి ఎలక్ట్రిక్ బైక్ తీసుకొచ్చింది హైదరాబాద్‌కు చెందిన గ్రావ్‌టన్‌ మోటార్స్‌ సంస్థ. నగరాలు, పట్టణాలతోపాటు గ్రామీణ రోడ్లపైనా ఇబ్బందులూ లేకుండా ప్రయాణించేలా ఉండేలా  విద్యుత్‌ ఎలక్ట్రిక్ బైక్ ను మార్కెట్‌లోకి తెచ్చింది.

ఈ గ్రావ్‌టన్‌ మోటార్స్‌ సంస్థ హైదరాబాద్‌కు చెందిన ఓ స్టార్టప్‌ కంపెనీ. ఈ సంస్థ తన తొలి విద్యుత్‌ వాహనం క్వాంటాను తీసుకొచ్చింది. ఈ బైక్‌ను ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 120 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. లి-ఐయాన్‌ బ్యాటరీని రిబ్‌డ్‌ ఛాసిస్‌లో బిగిస్తారు. దీని ద్వారా భద్రతకు ప్రాధాన్యం లభిస్తుంది. ఈ బైక్ ప్రత్యేకత ఏంటంటే.. రూ.80 ఖర్చుతో 800 కిలోమీటర్ల ప్రయాణం వీలు పడుతుంది. ఈ లక్ష్యంతోనే దీన్ని రూపొందించినట్లు గ్రావ్‌టన్‌ మోటార్స్ చెబుతోంది.

గ్రావ్‌టన్‌ మోటార్స్ సంస్థ ఇప్పటికే తమ ఆన్‌లైన్‌ వెబ్‌సైటు ద్వారా బుకింగ్‌లు స్వీకరిస్తుంది. సాధారణంగా విద్యుత్‌ వాహనాన్ని వినియోగించే వారికి ప్రధానంగా ఇంకా ఎంత దూరం వెళ్లగలం అనే ఆందోళన ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ భయం అధిగమించేందుకు యావరేజ్‌ గా 120 కిలోమీటర్ల కన్నా అధికంగా ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ గ్రావ్‌టన్‌ మోటార్స్ బీఎల్‌డీసీ మోటార్‌ 3 కిలోవాట్‌ అంటే 4బీహెచ్‌పీ శక్తిని రిలీజ్ చేస్తుంది. అంతే కాదు.. గంటకు 70 కిలోమీటర్ల గరిష్ఠ వేగం ఈ బైక్ సొంతం.

ఈ బైక్ బ్యాటరీ మూడు గంటల్లో పూర్తిగా ఛార్జింగ్‌ అవుతుంది. దీనితో పాటు ఎక్స్ ట్రాగా మరో బ్యాటరీని బిగించుకునే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ప్లాంటులో నెలకు 2,000 బైక్‌లు తయారవుతాయట. ఈ ప్లాంట్‌ సామర్థ్యాన్ని విస్తరించి 5,000 యూనిట్లను ఉత్పత్తి చేయాలని టార్గెట్‌ విధించుకుంది. ఇంతకీ ఈ బైక్ ధర ఎంతో చెప్పలేదు కదా.. ఈ బైక్ ధర ప్రస్తుతం రూ.99,000లుగా నిర్ణయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: