శోభిత ధూళిపాళ్లనే కాదు.. ఆ హీరోయిన్ కూడా ప్రెగ్నెంట్ నే..ఫ్యాన్స్ కి డబుల్ గుడ్ న్యూస్ లు..!?
ఇలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు మరో హీరోయిన్‌కు సంబంధించిన ప్రెగ్నెన్సీ వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు… కీర్తి సురేష్. తన చిన్ననాటి స్నేహితుడిని ప్రేమించి వివాహం చేసుకున్న కీర్తి సురేష్ ప్రెగ్నెంట్ అంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వేగంగా వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలు అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తుండగా, మరోవైపు ఇండస్ట్రీలో కూడా పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి.కీర్తి సురేష్ ఇటీవల ‘రివాల్వర్ రేట్’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో కూడా ఆమె చురుగ్గా పాల్గొంది. ఆ సమయంలో ఆమె ప్రెగ్నెన్సీకి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. అయితే తాజాగా కోలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం, కీర్తి సురేష్ ప్రెగ్నెంట్ అని తెలుస్తోంది.
అంతేకాదు, ఇదే కారణంతో ఆమె ఒక భారీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. బిగ్ ప్రాజెక్ట్ నుంచి తాను తప్పుకుంటున్నానని డైరెక్టర్‌కు చెప్పిన సమయంలోనే ఆమె ప్రెగ్నెన్సీ విషయం బయటకు వచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వరుసగా ప్రాజెక్టుల నుంచి తప్పుకుంటుండటంతో, ఈ వార్తలకు మరింత బలం చేకూరిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో కీర్తి సురేష్ ప్రెగ్నెన్సీ వార్తలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. అభిమానులు దీనిని న్యూ ఇయర్ ట్రీట్‌లా భావిస్తూ ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కీర్తి సురేష్ జీవితంలో ఇది ఒక మధురమైన మైలురాయిగా మారబోతుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూనే, సోషల్ మీడియా మాత్రం ఇప్పటికే ఈ వార్తలను పండగలా మార్చేసింది.