ఇసుజు కార్లపై సర్వీస్,వారంటీ పెంపు..

Purushottham Vinay
జపనీస్ కార్ల బ్రాండ్ ఇసుజు మోటార్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇండియాలో వీటికి మంచి క్రేజ్ ఉందనే చెప్పాలి.ఇండియన్ మార్కెట్లో అమ్ముతున్న తమ కార్లపై సర్వీస్ అలాగే వారంటీల గడువును పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించడం జరిగింది. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తిని తగ్గించడానికి కొనసాగుతున్న లాక్‌డౌన్‌ల కారణంగా, ఈ సేవలను సరైన సమయంలో ఉపయోగించుకోలేని కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలపడం జరిగింది.
ఇక ఇసుజు మోటార్స్ ఇండియా తెలిపిన సమాచారం ప్రకారం చూసినట్లయితే మార్చి 1, 2021 నుండి మే 31, 2021 మధ్యలో వారంటీ ముగిసిన వాహనాల కోసం ఇప్పుడు ఈ వారంటీ వ్యవధిని జులై 31, 2021 వరకూ పొడగిస్తున్నట్లు కంపెనీ తెలిపడం జరిగింది. ఇంకా అదేవిధంగా, మార్చి 1, 2021 నుండి మే 31, 2021 మధ్యలో పీరియాడిక్ సర్వీస్ గడువు ముగిసిన కార్లకు కూడా ఈ గడువు తేదీని జూలై 31, 2021 వరకూ పొడగిస్తున్నట్లు కంపెనీ వివరించడం జరిగింది.
ఇక ఇసుజు మోటార్స్ ఇండియా ఇటీవలే భారత మార్కెట్లో తమ సరికొత్త అప్‌డేటెడ్ బిఎస్ 6 డి-మాక్స్ రేంజ్ పికప్ ట్రక్కులను అలాగే కొత్త బిఎస్ 6 ఎమ్‌యు-ఎక్స్ ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేయడం జరిగింది.ఇసుజు డి-మ్యాక్స్ రేంజ్‌లో కంపెనీ హై-ల్యాండర్ అలాగే వి-క్రాస్ అనే రెండు వెర్షన్లను అమ్మటం జరుగుతుంది.హై-ల్యాండర్ ఒక స్టాండర్డ్ పికప్ ట్రక్కు మాదిరిగా ఉంటుంది. దీనిని వ్యక్తిగత ప్రయోజనం కోసం లేదా వాణిజ్య ప్రయోజనం కోసం ఉపయోగించుకోవచ్చు. వి-క్రాస్ పికప్ ట్రక్కును మాత్రం ప్రీమియం లైఫ్‌స్టైల్ వాహనంగా ప్రవేశపెట్టారు.
ఇక వీటి ఫీచర్స్ విషయానికి వస్తే రెండు పికప్ ట్రక్కులు కూడా ఒకేరకమైన బిఎస్ 6-కంప్లైంట్ 1.9-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్‌ను కలిగి ఉంటాయి. ఈ ఇంజన్ ఎక్కువగా 163 హెచ్‌పి పవర్‌ను ఇంకా అలాగే 360 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. వీటిలో హై-లాండర్ 6-స్పీడ్ మాన్యువల్ 2-వీల్ డ్రైవ్ సిస్టమ్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. కాగా, వి-క్రాస్ మాత్రం 6-స్పీడ్ మ్యాన్యువల్ ఇంకా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. అలాగే, 2-వీల్ డ్రైవ్ ఇంకా 4-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో కూడా అందుబాటులో ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: