ద్విచ్రవాహనంపై యువతకు ఆసక్తి ఉంటుంది. మార్కెట్ లోకి కొత్త బైకులు అలానే వస్తున్నాయి. ముఖ్యంగా హోండా కంపెనీ ఎన్నో కొత్త మోడల్ బైక్ లను విడుదల చేసింది. అవన్నీ కూడా యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఎప్పటికప్పుడు మార్కెట్ లోకి వస్తున్న ఈ కంపెనీ బైక్ లకు మంచి డిమాండ్ కూడా ఉంది. ఇది ఇలా ఉండగా తాజాగా మరో కొత్త ఫీచర్స్ తో కొత్త బైక్ మార్కెట్ లో సందడి చేస్తోంది. అదే హోండా ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ స్పోర్ట్స్ బైక్ ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది..
ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ బైక్ ను రెండు వేరియంట్స్ లో లభిస్తుంది.. ఈ బైక్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి.. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన ఈ బైక్ యువతను విపరీతంగా ఆకట్టుకుంది. మరి ఈ బండి ఫీచర్స్ ను ఒకసారి తెలుసుకుందాం.. హోండా ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ స్పోర్ట్ బి ఏం డబ్ల్యు ఆర్ 250 GS , డూకాటి మల్టీస్ట్రాడా 950 s , ట్రయంఫ్ 900 వంటి బైక్స్ కు ప్రత్యర్థి గా నిలవనుంది. మాన్యువల్ వేరియంట్ డార్క్ నెస్ బ్లాక్ మెటాలిక్ కలర్ లో లభిస్తుంది. దీని ఎక్స్ షో రూమ్ ధర రూ. 15. 96 లక్షలు. డిసిటీ వేరియంట్ పెర్ల్ గ్లేర్ వైట్ ట్రై కలర్ ఆప్షన్ లో లభిస్తుంది. దీని ఎక్స్ షో రూమ్ ధర రూ.17.50 లక్షలు .
హోండా ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ స్పోర్ట్ బైక్ 1084 సీసీ ప్యారలల్ ట్విన్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ 98 బి హెచ్ పి శక్తిని, 103 ఎన్ఎమ్ పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో అర్బన్, గ్రావెల్, ఆఫ్- రోడ్ వంటి ముల్టిపుల్ రైడింగ్ మోడ్స్ ను కలిగి ఉంది. ఈ బైక్ లో డ్యూయల్ హెడ్ ల్యంప్స్ , ఎల్ఈడి డిఆర్ఎల్స్ , కార్నిగ్ లైట్స్, క్రూయిస్ కంట్రోల్, 5- అడ్జస్టబుల్ విండ్ స్క్రీన్, 6 – యాక్సిస్ ఇనర్షియల్ మెజర్మెంట్ యూనిట్ , 7- లెవెల్ హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ , ఇంకా టిడబ్లూబి ని నియంత్రిస్తుంది. దీని వెనుక క్యారియర్ లో , ర్యాలీ స్టెప్, డిసిటి పాడిల్ షిఫ్టర్ , ఫాగ్ లాంప్ ఎ టి టి , ఫాగ్ లాంప్ , విజిర్ , సైడ్ పైప్ ఉన్నాయి.. చూసారుగా బైక్ అదిరిపోయే ఫీచర్స్ మార్కెట్ లోకి వచ్చిన బైక్ మీరు కొనుక్కోండి..