కుర్రకారు మతి పోగొడుతున్న బైక్.. ధర ఎంతో తెలుసా...!!

Satvika
యువత ఎక్కువగా బైక్ లను కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ముఖ్యంగా ఫీచర్స్ ఎక్కువగా ఉన్న వాటికి ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారు.అయితే ఇప్పుడు మాత్రం ఎలక్ట్రిక్ స్కూటర్లపై డిమాండ్ మాత్రం భారీగా పెరుగుతున్నాయి. అందుకే వీటికి ప్రస్తుతం డిమాండ్ కూడా ఎక్కువే ఉంటుంది. తాజాగా ఈ సంస్థ తన గ్రేజియా మోడల్లో సరికొత్త ఎడిషన్ ను భారత విపణిలో లాంచ్ చేసింది. అదే ఎంతో పాపులరైన హోండా గ్రేజియా 125 స్పోర్ట్స్ఎడిషన్. ఎక్స్ షోరూంలో ఈ స్కూటర్ ప్రారంభ ధర వచ్చేసి రూ.82,546లుగా సంస్థ వెల్లడించింది..



2021 హోండా గ్రేజియా 125 స్పోర్ట్స్ ఎడిషన్ 124 సీసీ సింగిల్ సిలీండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 6000 ఆర్పీఎం వద్ద 8.14 బీహెచ్ బ్రేక్ హార్స్ పవర్, 5000 ఆర్పీఎం వద్ద 10.3 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకకాుండా సీవీటీ ఆటోమేటిక్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది. ఎడిషన్ మోడల్లో రెండు కొత్త పెయింట్ స్కీమ్స్ తో పాటు ఫ్రెష్ బాడీ గ్రాఫిక్స్ ఉన్నాయి. పెరల్ నైట్ స్టార్ బ్లాక్, స్పోర్ట్స్ రెడ్ కలర్లో ఇది లభ్యమవుతుంది.



ఈ ఫీచర్ల విషయానికొస్తే..అన్నీ రకాల పనులకు ఉపయోగించుకోవచ్చు..మల్టీఫంక్షన్ ఇగ్నేషన్ స్విచ్, ఫుల్లీ డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్, అల్లాయ్ వీల్స్, ఎక్సటర్నల్ ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్, ఐడిల్ స్టార్ట్-స్టాప్ సిస్టం లాంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. అర్బన్ ప్రాంతాల్లో ఈ స్కూటర్ అత్యుుత్తమంగా పనికొస్తుందని, ముఖ్యంగా కుర్రకారుకు బాగా ఆకట్టుకుంటుందని అంటున్నారు.. హోండా సేల్స్ మార్కెటింగ్ డైరెక్టర్ యద్వీందర్ సింగ్ గులేరియా అన్నారు. భారత మార్కెట్లో ఈ సరికొత్త హోండా గ్రేజియా 125 స్పోర్ట్స్ ఎడిషన్ కు పోటీగా టీవీఎస్ ఎన్ టార్క్ 125 రేస్ ఎడిషన్, సుజుకీ బర్గ్ మన్ స్ట్రీట్ 125 లాంటి స్కూటర్లు ఉన్నాయి.. ఇప్పుడు యువత ఈ స్కూటర్ ను కొనడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాంతో మార్కెట్ లో ఈ స్కూటర్ కు డిమాండ్ భారీగా పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: