
మరో కొత్త బైక్ ను లాంఛ్ చేసిన హీరో ..తక్కువ ధరతో ఎక్కువ ఫీచర్స్..
ఈ బైక్ ప్రత్యేకతలు విషయానికొస్తే.. ఈ బైకు లో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి.. ముందు వచ్చిన బైక్ లో ఎన్నో మార్పులు చేర్పులు చేసి ఈ కొత్త బైక్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో భాగంగా ట్విన్ ఎల్ఈడీ హెడ్ ల్యాంపులు. ఎల్ఈడీ టెయిల్ లైట్లు. రియర్ కౌల్ డిజైన్, యాంటి స్లిప్ సీట్లు లాంటి వాటిలో మార్పులు చేసింది హీరో సంస్థ. అంతేకాకుండా ఫుల్లీ డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నేవిగేషన్, గేర్ ఇండికేటర్, ట్రిప్ మీటర్, సర్వీస్ రీమైండెర్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి..
ఇక ఈ బైక్ కలర్స్ విషయం చూస్తే..పెరల్ ఫేడ్ లెస్ వైట్, స్టాండర్డ్ స్పోర్ట్ రెడ్, ప్యాంథర్ బ్లాక్ లాంటి కలర్స్ లో ఇది అందుబాటులోకి వచ్చింది.199 సీసీ సింగిల్ సిలీండర్ ఆయిల్ కూల్డ్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 17.8 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 16.4 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 5-స్పీడ్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది.. లేటెస్ట్ గేర్స్ వంటివి ఇందులో కలిగి ఉంటాయి.భారత మార్కెట్లో ఈ మోటార్ సైకిల్ కు పోటీగా బజాజ్ పల్సర్ ఆర్ఎస్200, కేటీఎం ఆర్సీ200 లాంటి బైక్స్ ఉన్నాయి. కానీ హీరో బైక్ కు మాత్రం భారీ డిమాండును మార్కెట్ నిపుణులు అంటున్నారు..