ఒకినవ ఎలక్ట్రికల్ స్కూటర్ ఫీచర్స్ ఇవే..!

Kothuru Ram Kumar
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మరి కారణంగా చాల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మహమ్మారి ఎప్పుడు ఎలా వ్యాపిస్తుందో ఎవరికి తెలీదు. ఈ వైరస్ కారణంగా చాల మంది ఇంటి నుండి బయటికి రావడానికి భయపడిపోతున్నారు. దీంతో క్లిష్ట సమయంలో చాల మంది సొంత వాహనం కొనుకోవాలని అనుకుంటున్నారు. అయితే అలాంటి వారు ఈ వాహనం గురించి తప్పక తెలుసుకోవాల్సిందే.
ఒకినవ కంపెనీ స్లో స్పీడ్ స్కూటర్ ను విపణిలోకి ప్రవేశపెట్టింది. ఇక ఈ ఎలక్ట్రికల్ స్కూటర్ ను పిల్లలకు కూడా మంచి అనుభవాన్ని అందించేందుకు వీలుగా రూపొందించారని సంస్థ యాజమాన్యం తెలిపారు. అంతేకాదు ఈ స్కూటర్ కేవలం గంటకు 20 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించగలవని తెలిపారు. అంతేకాక ముఖ్యంగా వీటిని మహిళలు ఇంట్లో ఉండే మధ్య వయసు పిల్లలు కూడా బయటికి వెళ్లడానికి ఎంత గానో సౌకర్యవంతంగా ఉంటాయని తెలిపారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఒకినవ ఆర్ 30 మోడల్ ను మార్కెట్లోకి తీసుకువచ్చిందని తెలియజేశారు. ఇక ఈ స్కూటర్ లో బ్యాటరీ 1.5 కిలో వాట్స్ లిథియం అయాన్ బ్యాటరీ మార్చుకునే విధంగా ఉంటుందని తెలిపారు.
ఇక ఈ స్కూటర్ లో 5 ఏఎంపీ ద్వారా మన ఇంట్లో ఛార్జింగ్ చేసుకోవచ్చునని తెలిపారు. ఇక ఈ స్కూటర్ డిజైన్ విషయానికొస్తే పెరల్ వైట్, సన్ రైస్ ఎల్లో, సి గ్రీన్, మెటాలిక్ ఆరెంజ్, గ్లోసి రెడ్ లాంటి మొత్తం ఐదు రంగులలో ఈ స్కూటర్ లభించనున్నదని తెలియజేశారు. ఈ స్కూటర్ కు మరింత అందాన్ని చేకూర్చేందుకు స్టైలిష్ అల్యూమినియం అల్లాయ్ వీల్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ స్కూటర్ ధర రూ . 58,992 గా నిర్దారించారు. కాగా ఇందులో మొత్తం మూడు సంవత్సరాల వారంటీతో మోటార్ సైకిల్ పైబ్యాటరీని అందించనున్నట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: