ఆ మోడల్స్ పై ధరలను పెంచిన టయోటా ...!

Kothuru Ram Kumar

వచ్చే నెల నుండి టయోటా కార్ల కంపెనీ వారి కార్ల యొక్క ధరలను పెంచటం అవుతుంది. భారత మార్కెట్లో వారు విక్రయిస్తున్న వెల్‌పైర్ (Vellfire ), క్యామ్రీ హైబ్రిడ్ (Camry Hybrid) మోడల్ ధరపై జూలై నుంచి ధరలు పెరుగుతాయని టయోటా ఇండియా కంపెనీ తెలియజేసింది.

 

ఇకపోతే ఆ ధరలు ఎంత వరకు పెరుగుతాయో పూర్తి వివరాలు మాత్రం కంపెనీ తెలపలేదు. ఇకపోతే ఈ నెల ఆఖరి వరకు ప్రస్తుతం ఉన్న ధరలు మాత్రమే కొనసాగుతాయని కంపెనీ తెలియజేసింది. ఇక వాటికి సంబంధించి కొత్త రేట్లను జూలై నెలలో ప్రకటించి అప్పటినుంచి అమలులోకి తీసుకువస్తామని కంపెనీ తెలియజేసింది.

 

 

ఇకపోతే తాజాగా ఎక్స్చేంజ్ రేట్ లో గణనీయమైన పెరుగుదల కారణంతో ఈ మోడల్ ధరలు పెంచాల్సి వచ్చిందని టయోటా కంపెనీ దీనికి వివరణ తెలిపింది. ఈ రెండు మోడల్స్ లలో విడి భాగాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే విభాగాలు ఎక్కువగా ఉండడంతో వీటి ఉత్పత్తికి అవసరమయ్యే ఖర్చు పెరుగుతుండడంతో ఈ నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్లు కంపెనీ తెలియజేసింది.

 

 

ఇకపోతే టయోటా కంపెనీ తాజాగా విడుదల చేసింది టయోటా వెల్ వైర్. అల్ట్రా ప్రీమియం లగ్జరీ విభాగంలో మొదలుపెట్టిన ఈ మోడల్ సెగ్మెంట్లోని మెర్సిడెస్ బెంజ్ సి - క్లాస్ తో పోటీ పడుతుంది. ఇక ఈ కార్ ధర భారత్ లో ఏకంగా 79.5 లక్షలుగా ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: