మారుతి ఇగ్నిస్‌ ఎంత అద్భుతంగా ఉందొ చూశారా ?

Durga Writes

ఈ మధ్యకాలంలో కొత్త కొత్త కార్లు వస్తున్నాయి.. అద్భుతంగా ఉంటున్నాయి.. ఇంకా ఇప్పుడు ఈ సంవత్సరం ఆటో ఎక్స్ పో 2020లో అయితే ఇంకా మరెన్నో కొత్త కొత్త మోడల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఆ కార్లలో ఓ ప్రత్యేకమైన అద్భుతమైన కారు వచ్చింది. అది ఏంటి అంటే.. 

 

మన దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్ద అయినా మారుతీ సుజుకి హ్యాచ్‌బ్యాక్ ఇగ్నిస్ అప్‌గ్రేడ్ వెర్షన్‌ను నిన్న లాంచ్ చేసింది. ఢిల్లీలో నిన్న జరిగిన ఆటో ఎక్స్‌పో 2020లో ఈ హ్యాచ్‌బ్యాక్ ఇగ్నిస్ అప్‌గ్రేడ్ వెర్షన్‌ను లాంచ్ చేశారు. అయితే దీన్ని బీఎస్‌-6 పెట్రోల్  ఇంజీన్‌తో అప్‌గ్రేడ్‌ చేశారు. 

 

ఈ హ్యాచ్‌బ్యాక్ ఇగ్నిస్ ఏడు వేరియంట్లలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తుంది. ఇప్పుడు ఉన్న పాలెట్‌తో పాటు లూసెంట్ ఆరెంజ్, టర్కోయిస్ బ్లూ అనే రెండు కొత్త రంగులలో ఈ వాహనం లభ్యం కానుంది. అయితే ఇప్పుడు ఇది వాహనదారులకు సరికొత్త అంచనాలకు దగ్గరగా కొత్త ఇగ్నీస్ తో సిద్ధంగా ఉంది అని.. వాహనదారులను ఆకట్టుకుంటుంది అని కంపెనీ సీఎండీ కెనిచి ఆయుకావా వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: