ఆ గుడిలోకి నగ్నంగా వెళ్లాల్సిందే...లేకపోతే నో ఎంట్రీ ?

Veldandi Saikiran
జపాన్ లో ఎన్నో పురాతన దేవాలయాలు మరియు ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో జపాన్ లోని ఒకయామా ప్రాంతంలో ఉన్న సాయిదైజి కన్నోనిన్ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రతి ఏటా ఫిబ్రవరి నెల రాగానే ఈ ఆలయానికి పురుషులంతా ఓ చెక్క దుంగ దర్శనం కోసం నగ్నంగా ముస్తాబవుతారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి 15వ తేదీ రాత్రి 10:00 సమయం కాగానే పురుషులంతా ఆలయంలోకి ప్రవేశించి పూజలు నిర్వహిస్తారు.

నేకెడ్ ఫెస్టివల్ అని పిలవబడే ఈ పండుగలో దుంగను దర్శిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని అక్కడి భక్తులు విశ్వసిస్తారు. అయితే ఈ పూజలకు పూర్తి నగ్నంగా హాజరు కావలసిన అవసరం లేదు. ఈ పూజలో పాల్గొనే వారందరూ లంగోటి మాత్రమే ధరించాలి. అందుకే ఈ పండుగను నేకెడ్ ఫెస్టివల్ అని అంటారు. 1250 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఉత్సవంలో పాల్గొన్న వారందరూ నీటి గుండా నగ్నంగా వెళ్లి పూజలు నిర్వహిస్తారు. అయితే కేవలం పదివేల మందికి మాత్రమే ఆలయం లోపలికి ప్రవేశం ఉంటుంది.

అలా ఆలయంలోకి మొదట ప్రవేశించే పదివేల మంది మాత్రమే అదృష్టవంతులని అక్కడి భక్తులు విశ్వసిస్తారు. పూజల అనంతరం పూజారులు విసిరే వంద కర్ర ముక్కలు ఎవరికైతే లభిస్తాయో వారికి దేవుని కటాక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ పండుగను జపాన్ లోని దక్షిణ భాగంలోని హోన్షు ద్వీపంలో జరుపుకుంటారు. మొదట మహిళల నృత్యంతో ఈ పండుగ ప్రారంభం అవుతుంది.

ఈ ఆలయానికి వచ్చిన భక్తులందరూ దేవతను తాకాలి. అయితే ఫిబ్రవరి నెలలో అక్కడ తీవ్రమైన చలి ఉంటుంది. ఆలయానికి పురుషులు నగ్నంగా రావలసి ఉంటుంది, ఆ తర్వాత ప్రధాన ఆలయంలోకి ప్రవేశించే ముందు గడ్డ కట్టిన చల్లని నీటితో స్నానాలు ఆచరించాలి. పూజల అనంతరం పూజారులు విసిరే కర్రలను అందుకునే క్రమంలో చాలామందికి గాయాలు కూడా అవుతుంటాయి. ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది. కానీ వారికి సాంప్రదాయాల పట్ల ఉన్న గౌరవంతో వారు ఈ ఆచారాన్ని పాటిస్తూనే వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: