ఇండియన్ మార్కెట్లోకి మరో చైనీస్ ఎలక్ట్రిక్ కార్?

Purushottham Vinay
ఇండియన్ ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లోకి మరొక చైనీస్ మోడల్ ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీ అయిన బివైడి ఆటో ఈమధ్యనే ఇండియాలో ప్రత్యక్షంగా తమ వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.ఇప్పుడు ఈ చైనీస్ బ్రాండ్ భారతదేశంలో తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది.బివైడి ఆటో తమ భారతీయ అనుబంధ సంస్థ బివైడి ఇండియాను ప్రారంభించడం ద్వారా ఇక్కడి మార్కెట్లో ప్రత్యక్ష వ్యాపారాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం, ఈ బ్రాండ్ దేశీయ మార్కెట్లో బివైడి ఇ6 అనే ఎలక్ట్రిక్ కారును విక్రయిస్తోంది. కాగా, ఇప్పుడు బివైడి అట్టో 3 పేరుతో కంపెనీ ఓ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విడుదల చేసేందుకు రెడీ అయింది.బివైడి అట్టో 3 ముందు వైపు నుండి చుడటానికి కియా కారెన్స్ లాగా కనిపిస్తుంది. రెండు వైపులా సన్నటి హెడ్‌ల్యాంప్స్ ఇంకా వాటి పైభాగంలో ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, ఆ రెండింటినీ కలుపుతూపోయే క్రోమ్ బార్, క్రింది భాగంలో రెండు చిన్న ఎయిర్ వెంట్‌లతో కూడిన సాలిడ్ ఫ్రంట్ బంపర్, స్టైలిష్ అల్లాయ్ వీల్స్, బ్లాకవుట్ చేయబడిన బి, సి పిల్లర్స్, ఫాక్స్ రూఫ్ రెయిల్స్, వెనుక వైపున కనెక్టింగ్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్, షార్క్ ఫిన్ యాంటెన్నా వంటి డిజైన్ ఎలిమెంట్స్‌ ఉన్నాయి.


బివైడి అట్టో 3 ఇంటీరియర్ చాలా క్లీన్‌గా, అతి తక్కువ భౌతిక బటన్లతో మంచి ఫ్యూచరిస్టిక్ లుక్‌ని కలిగి ఉంటుంది. డ్యాష్‌బోర్డు మధ్యలో అమర్చిన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ సాయంతోనే కారులోని ఎన్నో ఫీచర్లు కంట్రోల్ చేయబడుతాయి. ఇంకా ఇందులో లెవెల్-2 అటానమస్ డ్రైవింగ్ సిస్టమ్‌తో పాటుగా స్టాప్ అండ్ గో ఫంక్షన్‌తో కూడిన అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఫార్వర్డ్ కొలైజన్ వార్నింగ్, లేన్-కీపింగ్ అసిస్ట్, డోర్ ఓపెన్ వార్నింగ్, బ్లైండ్-స్పాట్ మానిటరింగ్ సిస్టమ్, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ ఇంకా అలాగే రియర్ క్రాస్-ట్రాఫిక్ అలెర్ట్ వంటి మరెన్నో స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి.ఇక పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, రాబోయే BYD Atto 3 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో మాక్సిమం 201 బిహెచ్‌పి పవర్ ఇంకా 310 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే పర్మినెంట్ మాగ్నెట్ సింక్రోనస్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఈ పవర్‌ఫుల్ మోటార్ కారణంగా, ఇది ఈ విభాగంలోని ఇతర ఎలక్ట్రిక్ కార్ల కన్నా చాలా శక్తివంతమైనదిగా నిలిచేలా చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కేవలం 7.3 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుందని ఆన్‌లైన్ లో లీకైన బ్రోచర్ వెల్లడిస్తోంది. మరి రియల్ వరల్డ్‌లో ఇదెలా పని చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: