ఇండియన్ మార్కెట్లోకి సుజుకి కటానా స్పోర్ట్స్ బైక్!

Purushottham Vinay
ఇక జపనీస్ టూవీలర్ బ్రాండ్ సుజుకి మోటార్‌సైకిల్, భారతదేశంలో తమ సరికొత్త రెట్రో-స్టైల్ బైక్‌ కటానా (Suzuki Katana) ను విడుదల చేయడం జరిగింది. భారత మార్కెట్లో సుజుకి కటానా బైక్ ధర వచ్చేసి రూ. 13.61 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉంది. ఇక నేటి నుండి సుజుకి మోటార్‌సైకిల్ డీలర్‌షిప్‌లలో ఈ బైక్ కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుందని కూడా కంపెనీ తెలిపింది.ఈ సరికొత్త సుజుకి కటానా బైక్ కు ఆ పేరును 1982 GS1000S కటానా ఇంకా అలాగే ఐకానిక్ సమురాయ్ స్వార్డ్ నుండి ప్రేరణ పొంది పెట్టడం జరిగింది. దీని డిజైన్ వచ్చేసి 1980 కాలం నాటి ఐకానిక్ జపనీస్ స్ట్రీట్ బైక్‌ నుండి ప్రేరణ పొందినది. ఇక ఈ కొత్త సుజుకి ప్రీమియం బైక్ కి సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకుందాం.ఇక ఈ కొత్త బైక్ దాని 1980ల పూర్వీకుల మాదిరిగానే, కొత్త 2022 కటానా ఇప్పటికే ఉన్న GSX సిరీస్ బైక్ GSX-S1000పై  ఆధారపడి ఉంటుంది. ఈ సుజుకి కటానా దాని మెకానికల్ బిట్‌లను లీటర్-క్లాస్ (1000సీసీ) జిక్సర్‌తో పంచుకుంటుంది. కొత్త 2022 సుజుకి కటానా బైక్ లో 999 సీసీ ఫ్యూయల్-ఇంజెక్ట్, ఫోర్-స్ట్రోక్, లిక్విడ్-కూల్డ్, DOHC ఇంకా ఇన్‌లైన్ ఫోర్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 11,000 rpm వద్ద 150.1 bhp పవర్ ను ఇంకా 9,250 rpm వద్ద 106 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.


ఇక ఈ ఇంజన్ నుంచి వచ్చే శక్తి సుజుకి క్లచ్ అసిస్ట్ సిస్టమ్‌తో కూడిన 6-స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా వెనుక చక్రానికి పంపిణీ చేస్తుంది. ఈ కొత్త సుజుకి కటానా ట్విన్-స్పార్ అల్యూమినియం ఫ్రేమ్ సెటప్‌తో పూర్తిగా సర్దుబాటు చేయగల 43ఎమ్ఎమ్ అప్‌సైడ్ డౌన్ కయాబా ఫ్రంట్ ఫోర్క్స్‌తో పాటుగా ఇంకా అలాగే వెనుక వైపు కూడా కయాబా నుండి గ్రహించిన సర్దుబాటు చేయగల ప్రీలోడ్ ఇంకా రీబౌండ్ డంపింగ్‌తో కూడిన మోనోషాక్‌ సస్పెన్షన్ సెటప్ ను కూడా కలిగి ఉంటుంది.ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ 120 మిమీ ట్రావెల్ కు అనుమతిస్తుంది, అయితే వెనుక షాక్ అబ్జార్వర్ స్పోర్టీ ఇంకా అలాగే కాస్ట్లీ రైడ్ కోసం 130 మిమీ ట్రావెల్ కు అనుమతిస్తుంది. ఈ కొత్త సుజుకి కటానాలో బ్రేకింగ్ విషయానికి వస్తే, ఇందులో ముందు వైపు 4-పిస్టన్ రేడియల్ మోనోబ్లాక్ కాలిపర్‌ల ద్వారా బిగించబడిన డ్యూయల్ 310ఎమ్ఎమ్ ఫ్లోటింగ్ డిస్క్‌లు అనేవి ఉంటాయి. ఇంకా అలాగే, వెనుక చక్రం పై సింగిల్ పిస్టన్ కాలిపర్‌లతో 240 ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్‌ అనేది ఉంటుంది. ఇక ఇవి రెండూ కూడా డ్యూయల్-ఛానల్ ఏబిఎస్ ను సపోర్ట్ చేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: