గుజరాత్లో చుక్కలు చూపించిన అమ్మాయిలు?
వీటినే శక్తి బృందాలని అంటారు. అమ్మాయిలను ట్రాప్ చేసి మతాలు మార్పిస్తున్న ముఠాలను పట్టుకుంటున్నారు.
గుజరాత్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ లో వీరు ప్రత్యేకంగా శక్తి బృందాలు ఉన్నాయి. అయితే ఇలాంటి కేసుల్లో చాలా మందికి బెయిల్ వచ్చింది. అయితే ఇలా పెరోల్ మీద బయటకు వచ్చి తప్పించుకుపోయిన జుషబ్ అనే వ్యక్తిని నలుగురు మహిళ ఇన్స్ పెక్టర్లు పట్టుకున్నారు. జుషబ్ అనే వ్యక్తి కొండల్లో తల దాచుకుంటూ ఇలాంటి వ్యవహారాలు చేస్తుంటాడు.
అయితే వాటిని టార్గెట్ చేసి అరెస్టు చేశారు. జుషబ్ పై అహ్మదాబాద్, జునా గడ్, రాజ్ కోట్ లలో 27 కేసులు ఉన్నాయి. అయితే పెరోల్ పై బయటకొచ్చిన తర్వాత నన్నెవరూ పట్టుకోలేరని ఛాలెంజ్ చేశారు. దీనిపై ఏటీఎస్ డీఐజీ మాత్రం జుషబ్ ను మహిళ పోలీసులతోనే పట్టిస్తానని చాలెంజ్ చేశారు. అదే విధంగా నలుగురు ఇన్ స్పెక్టర్లు వల పన్ని పట్టుకున్నారు. గతంలో జుషబ్ మాత్రం నన్ను గుజరాత్ పోలీసులు అసలు పట్టుకోలేరని వారికి చాలెంజ్ విసిరారు. ఈ చాలెంజ్ ను చేజ్ చేసి మరీ పట్టుకుని గుజరాత్ ఏటీఎస్ పోలీసులు శభాష్ అనిపించుకున్నారు.
శాంతి కాబెన్, అరుణ బెల్, నితాత్మిక, శకుంతల మన్, జితేశ్ అగ్నవాల్ అనే మహిళ ఇన్ స్పెక్టర్లు ఈ కరుడు గట్టిన నేరస్తుడిని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించారు. దీంతో వారిని అందరూ ప్రశంసిస్తున్నారు. అసలు పోలీసులు తనను పట్టు కోలేరని చాలెంజ్ చేసిన నేరస్తుడిని మహిళ పోలీసులతో పట్టించేలా చేసిన ఏటీఎస్ డీఐజీ ని పొగుడుతున్నారు.