చైనాలో పెరిగిపోతున్న అమ్మాయిల డామినేషన్‌?

Chakravarthi Kalyan
చైనాకి భారత్ కి మధ్య చాలా తేడాలు ఉంటాయి. వాటిలో ఒకటి భూభాగం. భారత్ భూభాగం పెద్దదే గాని చైనా భూభాగమంత పెద్దది కాదు. గతంలో చైనా జనాభా భారత కన్నా ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు ఆ రికార్డును భారత్ కొట్టేసింది. జనాభా లెక్క ప్రకారం చైనా కన్నా భారత్ ప్రథమ స్థానంలో నిలుస్తుంది. 2100 నాటికి భారతదేశ జనాభా 153 కోట్లు గా ఉండబోతే మన జనాభా 77 కోట్లుగా ఉండబోతుందని తెలుస్తుంది.

అయితే ఇవి ప్రస్తుతపు లెక్కలు. భవిష్యత్తులో ఈ లెక్కలు ఇంకా తగ్గే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. చైనాలో జనాభా ఈ రకంగా తగ్గడానికి కారణం అక్కడున్న ప్రజలు పెళ్లిళ్లు చేసుకోకపోవడం, పిల్లల్ని కనక పోవడం అని తెలుస్తుంది. ఇంకొక కారణం ఆలస్యంగా వివాహం చేసుకోవడం  అని తెలుస్తుంది. అయితే చైనాలో జనాభా తగ్గుతున్నట్లే భారత్ లో కూడా జనాభా తగ్గిపోయే అవకాశం ఉందని అలా తగ్గి 80 కోట్ల నుండి 90 కోట్ల వద్ద ఆగిపోయే ప్రమాదం ఉందని కూడా నిపుణులు లెక్క కడుతున్నారు.

ఎందుకు ఇలా జరుగుతుందంటే గతంలో బాల్య వివాహాల నుండి ఆ తర్వాత 14,15 ఏళ్లకే పెళ్లిళ్లు చేయడం జరిగేవి. అది కాస్త ఆ తర్వాత ఇంకొంచెం లేటుగా అంటే 18-19 వయస్సులో ఒకరకంగా అది పెళ్లి చేసుకోవడానికి సరైన వయసే. అయినా అంతకుముందు కాలంతో పోల్చుకుంటే లేటు అయినట్టే లెక్క. ఆ తర్వాత ఆ 18 19 వయసు కూడా దాటిపోయి 20, 25, 30 వచ్చినా సరే, 30 దాటి పోతున్నా సరే పెళ్లిళ్లు చేసుకోని పరిస్థితి ఏర్పడింది.

చైనాలో అయితే అబ్బాయిల సంఖ్య పెరిగిపోయి అమ్మాయిల సంఖ్య తగ్గిపోయే సరికి అమ్మాయిల డామినేషన్ పెరిగిపోయిందని తెలుస్తుంది. చివరికి అక్కడ అబ్బాయిలు అమ్మాయిలకు  కన్యాశుల్కం ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంటామన్నా సరే అమ్మాయిలు ఒప్పుకోవడం లేదని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: