సామాజిక సేవా కార్యక్రమాల్లో దూసుకెళ్తున్న తేజస్వి

D.V.Aravind Chowdary
ఆమె ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్, చక్కటి జీతంతో పాటుగా దేనికి లోటు లేని జీవితం. అయితే ఆమె అక్కడితో ఆగిపోలేదు.పుట్టిన ఊరును శుభ్రం చేయడానికి నడుం బిగించింది. అవమానాలు వెక్కిరింపులను పట్టించుకోలేదు. తన లాంటి యువతను బృందంగా చేసుకుని వారికి రథసారథి గా మారి స్వచ్ఛత వైపు అడుగులు వేసింది. ఆమే ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణానికి చెందిన భూమి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు పొడపాటి తేజస్వి. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా తన గురించి మరింత తెలుసుకుందాం. 



ఒంగోలు లోని మధ్యతరగతి కుటుంబం లో జన్మించిన తేజస్వి తల్లిదండ్రులకు గారాలపట్టి. చిన్నతనం నుంచే సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. బీటెక్ చదువుతున్న సమయంలో ఓ పత్రికలో వచ్చిన వార్త ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఇంతకీ వార్త లో ఏం రాసారో తెలుసా ?




ఆ వార్త సారాంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం ఒంగోలు అని , నగరంలో ఏమాత్రం పరిశుభ్రత కనిపించిందని ఆ పత్రిక రాసింది. ఈ వార్తను చదివిన తేజస్వి  చాలా బాధపడింది. అసలు ఒంగోలు గురించి అలా రాయడానికి కారణాలు ఏంటని శోధిస్తే పట్టణంలో అపరిశుభ్రత ఎక్కువగా ఉందని తెలిసింది. 





ఈ అంశం మీద ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం ఆశించకుండా తన వంతు ఏమైనా చేయగలనా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ నిర్ణయం ఏంటంటే ఒక స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించడం. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిపితే ఆమె తండ్రి పూర్తి గా మద్దతు పలికారు. తండ్రి ప్రోత్సాహంతో 2015లో అంటే బీటెక్ చివరి సంవత్సరంలో తన స్నేహితులతో కలిసి ఒంగోలు లోనే "భూమి ఫౌండేషన్" ను ఏర్పాటు చేయడం జరిగింది. 




ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన స్వచ్ఛ భారత్ పిలుపు కూడా తను ఫౌండేషన్ స్థాపించాడానికి ముఖ్య కారణం అయ్యింది. ఒంగోలు ను స్వచ్ఛ పట్టణంగా మార్చడమే ఫౌండేషన్ ముఖ్య లక్ష్యం . మొదట ఒంగోలు కలెక్టరేట్ భవనం చుట్టుపక్కల్ని సుందరంగా తీర్చిద్ధిదారు.కలెక్టరేట్ తో మొదలైన ఫౌండేషన్ కార్యక్రమాలు పట్టణంలోని అన్ని ప్రాంతాలకు వేగంగా విస్తరించింది. 



 భూమి ఫౌండేషన్ చేపట్టిన స్వచ్ఛ ఒంగోలు కార్యక్రమంలో భాగమయ్యేందుకు పట్టణంలోని యువత సైతం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆ ఉద్యమంలో భాగమయ్యారు. శుభ్రం చేసిన చేసిన ప్రాంతాల్లో రంగులు వేసి "వన్ గోల్ క్లిన్ ఒంగోల్"  అంటూ వివిధ స్ఫూర్తివంతమైన నినాదాలు రాసేవాళ్ళు ఈ బృంద సభ్యులు. 




పట్టణంలో వీరు శుభ్రం చేసిన చెత్త వేసేవారు కాదు, ఆ ప్రాంతంలో గోడలపై పోస్టర్లు అంటించేవారు కాదు. వీరి కార్యక్రమం ఇప్పటికీ విజయవంతంగా నడవడం లో ఏంతో మంది కార్యకర్తల శ్రమ ఉంది అని తేజస్వి చెబుతున్నారు. చదువు పూర్తి చేసిన తర్వాత ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లో మంచి ఉద్యోగం వచ్చినా ప్రతి వారంతాల్లో ఒంగోలు వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తన జీతంలో చాలా భాగం ఫౌండేషన్ కోసం వేచ్చిస్తున్నారు. కేవలం స్వచ్చతకు మాత్రమే పరిమితం కాకుండా మొన్న కరోనా సమయంలో కూడ చాలా క్రియశీలకంగా వ్యవహరించారు. 




ఒంగోలు తర్వాత గుంటూరు, హైదరాబాద్ లలో సైతం ఈ ఫౌండేషన్ తన కార్యకలాపాలు విస్తరించింది. అక్కడ కూడా అందరి మన్ననలు పొందారు. హైదరాబాద్ నగరం సుందరికరణకు కృషి చేస్తున్న వీరిని ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ప్రతి యేటా హైదరాబాద్ లో జరిగే " మన నగరం" కార్యక్రమంలో అవార్డులు అందుకున్నారు.





 
స్వచ్ఛత కోసం భూమి ఫౌండేషన్ చేస్తున్న కృషి గురించి తెలుసుకున్న దేశ ప్రధాని మోడీ గారు తేజస్వి బృందాన్ని ప్రశంసించారు. ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదగా స్వచ్ఛ ఆంధ్ర పురస్కారాన్ని మూడు సార్లు అందుకున్నారు.




ఉద్యోగ భాద్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తూనే సామాజిక సేవా కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొంటున్న తేజస్వి ప్రస్తుత యువతకు ముఖ్యంగా యువతులకు స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: