మనిషా, మృగమా.. చైనా అధ్యక్షుడు ఘోరమైన ప్లాన్.. భయం గుప్పెట్లో దేశ ప్రజలు?
అసలు విషయం ఎవరికీ తెలియదు కానీ, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ను చాలామంది తిట్టుకుంటారు. కానీ అంతకంటే దుర్మార్గుడు జిన్ పింగ్. అవును, మరోవైపు చైనా అధ్యక్షుడు కావడం చేతను, అలాగే చైనాతో ప్రపంచ దేశాలు ఆర్థిక లావాదేవీలు కొనసాగిస్తున్న నేపథ్యంలో జిన్ పింగ్ ను ఏమీ చేయలేకపోయాయి. ఒకవేళ చైనాతో ఆర్థిక లావాదేవీలు గనుక లేకపోయి ఉంటే ఈపాటికి జిన్ పింగ్ ను ప్రపంచ దేశాలు తొక్కి పెట్టేవి అనడంలో అతిశయోక్తి లేదు. నాడు కరోనాతో ప్రపంచ దేశాలు విమర్శలు ఎదుర్కొన్న చైనా.. నేడు మరో పని చేసి అంతకంటే ఎక్కువ చీత్కరింపులు చవిచూస్తోంది.
విషయం ఏమిటంటే... చైనాలో అత్యంత రహస్యంగా నెరిపిన ఆ ఘోరాన్ని తాజాగా CNN IBN ఛానల్ బయట పెట్టింది. చైనా దేశంలో దాదాపు 200 ప్రత్యేకమైన జైళ్లను అక్కడి ప్రభుత్వం నిర్మిస్తోంది. బయటకి అవినీతి వ్యతిరేక కార్యక్రమంలో వీటిని వినియోగిస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. అసలు లక్ష్యం వేరే ఉన్నట్టు బయటకు పొక్కింది. చైనా నిర్మిస్తున్న ఈ జైళ్లను లియుజు అని పిలుస్తారు. ఇందులోకి వచ్చేవారిని 6 నెలల వరకు బంధించి ఉంచుతారు. వారికి అక్కడ ఎటువంటి న్యాయం అందించరు. ఆఖరికి కుటుంబ సభ్యులను కూడా కలవలేకుండా చిత్రహింసలకు గురిచేస్తారు. ఆరు నెలలపాటు వారిని జైళ్లళ్లో ఉంచుతారు.. అయితే చైనా తీసుకున్న ఈ నిర్ణయాన్ని చాలామంది తప్పు పడుతున్నారు. ఎందుకంటే? గతంలో జిన్ పింగ్ తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై ఉక్కు పాదాన్ని మోపారు. దానికి వారు అవినీతిపై వ్యతిరేక ఉద్యమం అనే పేరు పెట్టారు. అయితే మరలా అలాంటివారికోసమే లియుజు కేంద్రాలను చైనా ఏర్పాటు చేయడం దారుణం. ఈ కేంద్రాలలో అధికార కమ్యూనిస్టు పార్టీ నాయకులు మాత్రమే కాకుండా సివిల్ అధికారులు, హై ప్రొఫైల్ వ్యక్తులు, వ్యాపారవేత్తలు శిక్ష అనుభవించే అవకాశం ఉంది. దాంతో ఈ చర్యపై ఇపుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.