హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2024 :పెళ్లితో కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టిన లావణ్య ..!!

murali krishna
టాలీవుడ్ క్రేజీ బ్యూటీ లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ…ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది.. ఆ సినిమా తరువాత లావణ్య కి వరుస ఆఫర్స్ వచ్చాయి..కానీ కెరీర్ మలుపు తిప్పే సినిమాలు మాత్రం లావణ్య కు రాలేదు.. అక్కినేని నాగార్జున సరసన నటించిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమా సూపర్ హిట్ అయినా కూడా లావణ్య కి  చెప్పుకునే  క్రేజీ  ఆఫర్స్ అయితే రాలేదు…మెగా హీరో వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకొని ఈ భామ మెగా కోడలు అయిపోయింది..2017లో 'మిస్టర్‌' సినిమాతో వరుణ్ తేజ్, లావణ్యల మధ్య పరిచయం ఏర్పడగా... ఆ సినిమా సమయంలో ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు..ఇక ఆ సినిమా అంతా ఇటలీలోనే షూటింగ్ జరుపుకుంది. ఈ జంటకు ప్రేమ అడుగు ఇటలీలోనే పడిందని సమాచారం.. మిస్టర్ సినిమా చేదు ఫలితం ఇచ్చినా కూడా ఆ తర్వాత వీరి ఇద్దరు కలిసి నటించిన అంతరిక్షం మంచి విజయం సాధించింది. 

ఇక అంతరిక్షం సినిమా సమయంలోనే వీరు ఫ్రెండ్స్ నుంచి ప్రేమికులుగా మారారు..లావణ్య ప్రేమలో పడిన వరుణ్ తేజ్.. ఆమె బర్త్ డే రోజునే లవ్ ప్రపోజ్ చేసాడు.వరుణ్ ప్రేమను అంగీకరించిన లావణ్య... ఐదేళ్లుగా వరుణ్ ని సీక్రెట్ గా  లవ్ చేసింది..వీరు ప్రేమలో ఉన్నప్పటికీ ఎక్కాడా కెమెరాల కంటికి మాత్రం కనబడలేదు. మరోవైపు నిహారికతో కూడా ఈ భామ స్నేహం చేస్తూ.. మెగా కుటుంబానికి ఎంతగానో దగ్గరయింది. నిహారిక పెళ్లిలోనూ  లావణ్య సందడి చేసింది..ఇరు కుటుంబాలు వీరి పెళ్ళికి అంగీకరించడంతో వీరిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.. పెళ్లి తరువాత టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా వరుణ్, లావణ్య నిలిచారు.. అయితే పెళ్లి తరువాత లావణ్య సినిమాలలో నటించడం తగ్గించేసింది.. వెబ్ సిరీస్ లలో నటించినా అవి అంత ఆదరణ పొందలేదు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: