కావ్యకి షాక్ ఇచ్చిన నిఖిల్ తల్లి.. తట్టుకోలేక బిగ్ బాస్ బ్యూటీ ఏం చేసిందంటే?
అయితే ఇదిలా ఉండగా.. స్టార్ మా పరివారం కార్యక్రమంలోకి నిఖిల్ తల్లి సులేఖ ఎంట్రీ ఇచ్చింది. అయితే సులేఖ స్టేజ్ పైనకి ఎంట్రీ ఇవ్వగానే.. కావ్య అక్కడినుండి వెళ్లిపోయింది. సులేఖ స్టేజ్ పైనకి రాగానే నిఖిల్ ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత నిఖిల్ తన తల్లికి ఐదు సర్ ప్రైజ్‌లు ఇచ్చాడు. సొంత ఇల్లులేదని తన తల్లికోసం డ్రీమ్ హోమ్ కట్టిస్తున్నాని చెప్పాడు. అలాగే సినిమా డేట్, డిన్నర్ డేట్, ఇంటర్నేషనల్ ట్రిప్, పేరెంట్స్ ఇద్దరికీ డెస్టినేషన్ ట్రిప్ అంటూ ఐదు సర్ ప్రైజ్‌లు ఇచ్చాడు. అనంతరం సులేఖ
మాట్లాడుతూ.. రెండేళ్లలో నిఖిల్ పెళ్లి అయిపోతుందని.. మీకు ప్రామిస్ చేస్తున్నాను అని చెప్పుకొచ్చింది. దానికి నిఖిల్ కూడా థాంక్యూ అమ్మ అనేశాడు. ఇక ఫాన్స్ అందరూ పాపం కావ్య అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక నిఖిల్ హీరోగా నటించిన గోరింటాకు సీరియల్ లో హీరోయిన్ రోల్ లో కావ్య శ్రీ నటించింది. వీరిద్దరూ రిలేషన్ షిప్ లో కూడా ఉన్నారు. అయితే నిఖిల్ బిగ్ బాస్ కి వెళ్ళే ముందు వారికి గొడవ అయిందని సమాచారం. నిఖిల్ బిగ్ బాస్ కి వెళ్లక బయట నాకు వేరే ఉన్నారని.. బ్రేకప్ అయిందని నిఖిల్ అన్నాడు. బిగ్ బాస్ నుండి బయటికి వెళ్లిన తర్వాత తనని కలుస్తానని, తనపై ఉన్న ప్రేమని మళ్లీ వ్యక్తపరుస్తానని ఎమోషనల్ అయ్యాడు. కానీ నిఖిల్ హౌస్ నుండి బయటికి వచ్చి రోజులు గడిచాయి కానీ తాను కావ్య శ్రీ కలవడానికి వెళ్లలేదు అని తెలిసిందే.