షాక్: ఈ సినిమా చూసి.. అందరూ తిట్టుకుంటారు.. తమన్నా హాట్ కామెంట్స్..!

frame షాక్: ఈ సినిమా చూసి.. అందరూ తిట్టుకుంటారు.. తమన్నా హాట్ కామెంట్స్..!

Divya
టాలీవుడ్ హీరోయిన్ తమన్నా గురించి ఆమె నటన గురించి ,అందం గురించి ,డాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎన్నో చిత్రాలలో తనదైన స్టైల్ లో మెప్పించిన తమన్నా ప్రస్తుతం ఓదెల-2 సినిమాలో నటిస్తూ ఉన్నది. ఈ చిత్రం గతంలో ఓటీటిలో విడుదలైన ఓదెల రైల్వే స్టేషన్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్ర నుంచి ఇటీవలే టీజర్ వైరల్ కాగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తమన్నా ఇందులో ఒక విభిన్నమైన పాత్రలో ఈసారి కనిపించబోతున్నది.


ఇలాంటి సందర్భంలోనే తమన్నా మాట్లాడుతూ తనని చాలామంది తెలుగు అమ్మాయి అనుకుంటూ ఉంటారు.. ఈ విషయం తనకి కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే నాకు ఏదైనా ఎమోషన్ వచ్చిందంటే కచ్చితంగా తెలుగులో దాన్ని తెలియజేస్తాను కోపం వచ్చినా సరే తెలుగులోనే తిడతాను అందుకే నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టమని.. ఓదెల-2 సినిమా కూడా మీ అందరికీ నచ్చేలాగానే తీశామని కచ్చితంగా ఈ సినిమా చూసి నన్ను అందరూ తిట్టుకుంటారని కూడా తెలియజేసింది. ప్రస్తుతం తమన్నా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.



తమన్నా వ్యక్తిగత విషయాలకు వస్తే గత కొన్ని ఏళ్లుగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ఈమె డేటింగ్ లో ఉందనే విధంగా వార్తలు వినిపించాయి.కానీ ఈ మధ్యకాలంలో తమన్నా మాట్లాడుతున్న వ్యాఖ్యలు జీవిత సందేశాలను చూస్తే ఖచ్చితంగా వీరిద్దరూ విడిపోయారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి సోషల్ మీడియా అకౌంట్లో కేవలం ఫోటోలను అయితే డిలీట్ చేసుకున్నారని రూమర్స్ కూడా వినిపించాయి. కానీ ఈ విషయం పైన ఏ ఒక్కరు మాత్రం ఇప్పటివరకు సరైన క్లారిటీ ఇవ్వలేదు. తమన్నా హీరోయిన్ గానే కాకుండా పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్ లలో కూడా నటించి అదరగొట్టేసింది. మరి ఓదెల-2 సినిమాతో ఏ విధంగా విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: