ఎన్టీఆర్ - నెల్సన్ సినిమా కూడా ... నిర్మాత కూడా ఫిక్స్.. ?
- ప్రస్తుతం వార్ 2 షూటింగ్ లో బిజీ అయిన తారక్
- వార్ 2 - దేవర 2 తర్వాత ఎన్టీఆర్ - నెల్సన్ ప్రాజెక్టు సెట్స్ మీదకు .. ?
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .
టాలీవుడ్ యంగ్ టైగర్ & మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ - ప్రముఖ తమిళళ దర్శకుడు ఆర్ టీ నెల్సన్ కలయికలో సినిమా రాబోతుంది అన్న ప్రచారం గత కొద్ది నెలలు గా బాగా నడుస్తోంది. ఈ ప్రాజెక్టు ఉంటుందన్న టాక్ బయటకు వచ్చినప్పటి నుంచి ఈ సినిమా పై భారీగా బజ్ పెరిగింది. పైగా ఇప్పటికే ఈ సినిమా పై ఎన్నో రూమర్లు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా నిర్మాత నాగవంశీ తన తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.
నెల్సన్ ... ఎన్టీఆర్ గారి కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా విషయం లో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదని .. కేవలం ఎన్టీఆర్ గారి తో సినిమా చేయాలని నెల్సన్ తో పాటు మేం అంతా ఒక మాట అనుకన్నామని .. ఎన్టీఆర్ తో నెల్సన్ కు ఒక్క మీటింగ్ మాత్రమే జరిగిందని నాగవంశీ తెలిపారు. ప్రస్తుతం నెల్సన్ కథను రాస్తున్నారని.. ఎన్టీఆర్ నటిస్తోన్న పాన్ ఇండియా క్రేజీ ప్రాజెక్ట్ వార్ 2 పూర్తి అయ్యాక, ఎన్టీఆర్ కి నెల్సన్ కథ చెబుతారని.. కథ నచ్చాక ... అప్పుడు షూటింగ్ అప్ డేట్స్ తో పాటు ఆ సినిమా ను ఎలా లాంచ్ చేయాలి ? ఏ రేంజ్ లో ప్లాన్ చేయాల నే అంశాల పై ఆలోచన చేస్తాం అంటూ నిర్మాత నాగవంశీ తెలిపారు. ఇక నెల్సన్ విషయానికి వస్తే తమిళంలో బీస్ట్, జైలర్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను తెరకెక్కించాడు.