అమ్మ: గర్భిణులు సిజరిన్ డెలివరీ చేసుకుంటున్నారా..??

N.ANJI
పిల్లలకు జన్మనివ్వాలని ఏ మహిళ అనుకోదు.. అందుకే పెళ్ళైన ప్రతి మహిళల పిల్లల కోసం ఎన్నో కలలు కంటూ.. ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇక ప్రెగెన్సీ దాల్చిన దగ్గర నుండి పిల్లలకు జన్మనిచ్చే వరకు మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నార్మల్ డెలివరీ కాకుండా సిజరిన్ చేసి బిడ్డను బయటికి తీస్తున్నారు. కాగా.. డెలివరి విషయంలో తీసుకునే కొన్ని నిర్ణయాల వలన భవిష్యత్తులో లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వాస్తవానికి ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఒక్కసారి చూద్దామా.. సిజేరియన్ కంటే నార్మల్ డెలివరీనే చాలా మంచిది అని చెబుతున్నారు. ఇక నేటి సమాజంలో చాలామంది నార్మల్ డెలివరీ అంటే నొప్పులు పడాలి అవి మా వల్ల కాదని ఆపరేషన్ చేపించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఎదుకంటే..  సిజెరియన్ అయితే మత్తు మందు ఇస్తారు నొప్పి లేకుండా పని అయిపోతుందని భావిస్తున్నారు. వారికీ తెలియని విషయం ఏంటంటే.. నార్మల్ డెలివరీ అయితే ప్రసవం అయిన మూడు రోజులు మాత్రమే కొంచెం  ఇబ్బందిగా ఉంటుంది. ఆ తరువాత ఎలాంటి నొప్పులు అనేవి ఉండడవు.
అయితే ఆపరేషన్ చేయించుకుంటే భవిష్యత్తులో వెన్ను నొప్పి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అంతేకాదు.. సిజెరియన్ సమయంలో వెన్నెముకకి మత్తు ఇచ్చేటప్పుడు తల కాళ్ళ దగ్గరకి వచ్చేటట్టు శరీరాన్ని వంచడం వలన ఆ సమయంలో చాలా నొప్పి ఉంటుందని వెల్లడించారు. ఇక ఆ మత్తు ప్రభావం వెన్నెముకపై దీర్ఘకాలికంగా ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో నడుము నొప్పి వస్తుందని పేర్కొన్నారు.
ఇక  నార్మల్ డెలివరీ చేయించుకుంటే శరీరం మీద ఎలాంటి గీతలు కూడా ఉండవు అని అన్నారు. కాగా.. సిజేరియన్ చేస్తే శరీరంపై కుట్లు పడతాయని పేర్కొన్నారు. అయితే రెండు గంటలు నొప్పులు పడినాగాని నార్మల్ డెలివరీనే మంచిదని ఆరోగ్య నిపుణులు గర్భిణులకు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: