అమ్మ: ప్రెగ్నెసీ మహిళలు ఈ డైట్ పాటించండి..!!

N.ANJI
సాధారణంగా గర్భధారణ సమయంలో మహిళలు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వారు తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. వారు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి, రోగాల నుంచి బయట పడాలంటే మంచి డైట్‌ను పాటించాలని చెబుతున్నారు.
ఇక గర్భధారణ సమయంలో తీసుకునే ఆహారంలో చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ప్రెగ్నెన్సీలో కూడా ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు. ప్రెగ్నెసీ మహిళలు సరైన పద్ధతిలో ఆహారం తీసుకోవడం, పోషకాహారం తీసుకోవడం, ఒత్తిడి లేకుండా ఉండటం చాలా ముఖ్యం అని చెబుతున్నారు. ముఖ్యంగా గర్భిణులు తీసుకునే ఆహారంలో కూరగాయలు, పప్పులు, పాల ఉత్పత్తులు, మాంసం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
అంతేకాదు.. గర్భధారణ సమయంలో బాదం, జీడిపప్పు, అక్రోట్లు, వేరుశెనగ, పిస్తాపప్పులు లాంటివి చాలా మంచి ఆహారం అని చెబుతున్నారు. అయితే అందులో ఫ్యాట్స్, మాంసకృత్తులు, పీచుపదార్థాలు, విటమిన్లు మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి. ఇక వాటిని ప్రతి రోజూ ఎప్పుడైనా సరే గర్భిణీలు తినవచ్చునని చెబుతున్నారు. అలాగే బీట్రూట్ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. గర్భిణీల్లో రక్తహీనత సమస్యను పరిష్కరిస్తుందని అంటున్నారు.
అయితే శరీరానికి అవసరమైన ఐరన్‌ను అందించడమే కాకుండా.. జీర్ణక్రియను మెరుగుపరచడంలో దోహదపడుతుంది. అలాగే ఎండిన ఖర్జూర పండ్ల వల్ల శరీరానికి అవసరమైన ఐరన్, ఫోలేట్‌లు అందుతాయని అంటున్నారు. ఇక వారి శరీరానికి అవసరమైన ఫైబర్‌ను ఇవి అందిస్తాయని చెబుతున్నారు. వారిలో మలబద్ధకం సమస్య తగ్గుతుందని అంటున్నారు.
అంతేకాదు.. గర్భధారణ సమయంలో మహిళలు చేపలు తినడం మంచిదని చెబుతున్నారు. అందులో.. సముద్రపు చేపలకన్నా కూడా మంచి నీటి చేపలను తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. అయితే దానిమ్మ పండులో ఫోలేట్, పొటాషియం, విటమిన్ కే, ఐరన్, ఫైబర్ సమృద్ధిగా లభిస్తాయి. అంతేకాదు.. దానిమ్మను నేరుగా గానీ.. జ్యూస్‌ గానీ నెల రోజులపాటు క్రమం తప్పకుండా తాగాలని చెబుతున్నారు. దానిమ్మ రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో దోహదపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: