ప్రెగ్నెన్సీ సమయంలో అలా చేస్తే.. శిశువులకు తీవ్ర ప్రమాదమట..!
అదేవిధంగా ఆల్కహాల్ వంటి హానికరమైన వాటికి మాత్రం పూర్తిగా దూరంగా ఉండటం మంచిది అని వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కొంత మంది మాత్రం మహిళలు ఏవేమి పెద్దగా పట్టించుకోకుండా గర్భదారణ సమయంలో మద్యం సేవిస్తుంటారు. మరికొందరికి అయితే గర్భంతో ఉన్నప్పుడు కల్లు తాగితే పిల్లలు తెల్లగా పుడుతారనే వారిలో ఓ నమ్మకం. అయితే గర్భదారణ సమయంలో మద్యం సేవించడం ద్వారా వారి బిడ్డక ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ అనేది శిశువుకు శారీరక, మానసిక లోపాలు ఏర్పడుతాయని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఏర్పడిన సమస్యలను పూర్తిగా నయం చేయలేకపోవడం ఆందోళన కలిగించే విషయమని పేర్కొంటున్నారు. ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ బిడ్డకు ఎంత ప్రమాదకరమో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ కారణాలు
నిజానికి గర్భదారణ సమయంలో మద్యం సేవించినప్పుడు వారి పిండంలోకి సులభంగా చేరుతుంది. పిండం కడుపులో పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల కాలేయానికి ఆల్కహాల్‌ను జీర్ణం చేసే సామర్థం ఉండదు. ఈ స్థితిలో వారి శరీరంలో ఆల్కహాల్ అక్కడే పేరుకుపోవడం మొదలవుతుంది. ఇలాంటి పరిస్థితిలో శిశువుకు పూర్తి పోషకాలు, ఆక్సిజన్ సరిగ్గా అందకుండా ఉండడంతో పాటు పిల్లల అభివృద్ధికి ఆటకం ఏర్పడుతుంది.
ఎఫ్ఏఎస్ వల్ల ఏర్పడే సమస్యలు
బలమైన జ్ఞాపకశక్తి, అభ్యాస ఇబ్బందులు, గుండె సమస్యలు, కీళ్లు, అవయవాలు, వేళ్లతో వైకల్యం, మూత్రపిండాలు, ఎముకల సమస్యలు, కంటి, ముక్కు, వినికిడి సమస్యలు, తల చిన్నదిగా ఏర్పడటం, చురుకు లేకపోవడం, తక్కువ ఎత్తు, బరువు తక్కు తదితర సమస్యలు వస్తుంటాయి.
చికిత్స, నివారణ పద్దతులు
ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ కారణంగా పిల్లలకు కలిగే శారీరక లేదా మానసిక సమస్యలను అసలు నయం చేయలేం. కానీ మనస్తత్వ వేత్తలు.. స్పీచ్ థెరిపస్ట్‌లు, ఆక్యుపేషనల్ థెరపిస్ట్‌ల సహాయంతో ఎఫ్ఏఎస్‌తో బాధపడుతున్న పిల్లల సామర్థ్యాలను మెరుగుపరుచుకోవచ్చు. గర్భదారణ సమయంలో మద్యపానానికి పూర్తిగా దూరంగా ఉండటమే మేలు అని.. తద్వారా పిల్లలను ప్రమాదాల నుంచి రక్షించవచ్చు అని సూచిస్తున్నారు.