చలికాలంలో పిల్లల చర్మ రక్షణ కోసం ఈ టిప్స్ ను పాటించాలి..

Satvika
చలికాలంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా రొగాల బారిన పడటం కామన్. అందుకే వేడి గా వున్న వస్తువులను తీసుకొవాలని. ఎప్పటికప్పుడు ఆహారపదార్థాలను వేడిగా తీసుకోవడం వల్ల చలి నుంచి బయట పడవచ్చు. ఇక చిన్న పిల్లల విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే ఎన్నో సమస్యల బారిన పిల్లలు పడతారు. దేశంలో చలి బాగా ఎక్కువగా ఉంది. ఇటువంటి చలిని తట్టుకోవాలి అంటే కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
పెద్ద వాళ్ళ చర్మం తో పోలిస్తే పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. ఇప్పుడు అనేక సమస్యలు రావొచు. అందుకే తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని వైద్యులు చెబుతున్నారు. ఆ విషయాలను వివరంగా తెలుసుకుందాం..
ప్రతి రోజూ నూనె తో మసాజ్..
ప్రతి రోజు బేబీ ఆయిల్ తో మసాజ్ చేయాలి.. లేకుంటే చర్మం పగుల్లు ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు.. ఇలా ఉదయం సాయంత్రం మసాజ్ చేయడం వల్ల శరీరానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అప్పుడే చర్మం మంచి నిగారింపు తో అందంగా ఉంటుంది. మృదువుగా కూడా ఉంటుంది.
తల పై శ్రద్ద వహించాలి..
ఇంత చిన్న విషయం జరిగిన కూడా పిల్లల తల పొడిగా మారుతుంది.. ఎక్కువగా పగుల్లు వస్తాయి. ఇంట్లో దొరికే ఆయిల్స్ కాకుండా డాక్టర్ రాసిన నూనెను వాడాలి..షాంపు కూడా అదే వాడాలి. అప్పుడే తల బాగుంటుంది. ఇటువంటివి చలికాలంలో ఎక్కువగా తీసుకోవడం మంచిది.
బాత్ చేయడం..
ఉదయం 10 వరకూ చలి ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం 5 కి స్నానం చేయించడం మేలు.ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఎక్కువ సేపు వేడి నీటిలో ఉంచకూడదు.. అలా చెస్తె చర్మం నిర్జీవంగా మారుతుంది. తక్కువ గాడత ఉన్న సబ్బుల తో స్నానం చేయించాలి. అప్పుడే పిల్లల చర్మం బాగుంటుంది. ఇది గుర్తుంచుకోండి..
ఇకపోతే చలికి చర్మం పగలకుండా మంచి క్రీములను ఎంచుకొవాలి. కెమికల్స్ వాడని వాటిని ఉపయోగించాలి.పిల్లల పెదవులు పగలడం సాదారణం.. అయితే వైద్యులు సూచించిన జెల్స్ వాడటం ఉత్తమం.
డైపర్స్ విషయం లో జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే ర్యాషెస్ లు వచ్చే ప్రమాదం ఉంది. తడి లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి.. ఎన్నో ప్రమాదాల నుంచి బయట పడవచ్చు..
చుసారుగా పిల్లల విషయంలో ఈ చలికాలం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.. అప్పుడే మీ పిల్లలను చలి నుంచి కాపాడుతుంది.. మీ పిల్లలు ఆరోగ్యంగా కూడా ఉంటారు.. ఈ విషయాలు గుర్తుంచుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: