కనురెప్పల అందానికి ప్రయత్నిస్తే ఆ ప్రమాదం తప్పదు సుమీ..

Satvika
మహిళలు అందంగా కనిపించాలని తెగ ఉత్సాహపడి ఏదేదో చేస్తారు. కెమికల్స్ తో అందానికి మెరుగులు దిద్దుతారు. అటువంటివి అన్నీ వేళలా మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా కూడా చాలా మంది అందానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. చర్మ సౌందర్యాని కన్నా ఎక్కువగా కళ్ళ కు మెరుగులు దిద్దుతారు. అలా కెమికల్స్ వాడటం వల్ల కళ్ళు పోయే ప్రమాదం ఉందని చెబుథున్నారు. మెరుపులు కనిపించాలంటే అందులో బాగా ఈ కెమికల్స్ ను కలుపుతారు. అవి కంటి చూపును కూడా తగ్గిస్తాయని వైద్యులు అంటున్నారు. అందుకే వీటిని వాడే ముందు ఒకటికి పదిసార్లు ఆలొచించాలి.

కనురెప్పలు, కను బొమ్మల విషయం లో చాలా జాగ్రత్తగా వుండాలి.. అందం కోసం పొతే అందురాలు అవ్వడం ఖాయం. ఎటువంటి వాటిని చేస్తె ఎన్ని నష్టాలో ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం. కనురెప్పలకు కృత్రిమంగా వెంట్రుకలను అమర్చుతున్నారు. ఇలా చేయడం వల్ల నిజమైన వెంట్రుకలకు హాని కలుగుతాయి. అంతే కాదు  అవి మొత్తానికి పెరగడం ఆగి పోయే ప్రమాదం వుంది. కనుబొమ్మ వెంట్రుకలు పొడిగించడానికి వాడే జిగురులో ఫార్మాల్డిహైడ్ అనే విష పూరిత కెమికల్ ఉంటుంది. అది కళ్ళకు హాని కలిగించే ప్రమాదం ఉంది.

కళ్ళు మంచిగా కనిపించాలని మీరు నిత్యం కనుక ఇలా వాడితే సమస్యలు ఫ్యుచర్ లో అయిన కూడా భాదలు భరించాలి. కళ్ళు ఎర్రగా మారడం, కళ్ళ మంటలు, కళ్ళ పై వాపులు రావడం..ఇవి కాక దురదలు ఇలా చెప్పుకుంటూ పోతే.. కళ్ళకు లేని పోనీ సమస్యలను తెచ్చిపెట్టు కోవడమే.. మహిళలు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి.. అందం కన్నా ఆరోగ్యం మిన్నా.. మనం వాడే ప్రతీది కెమికల్స్.. మన శరీరంలో ముఖ్యమైన కళ్ళు ఒకటే.. అవి పోకుండా ఉండాలంటే న్యాచురల్ గా ఉండటమే ఉత్తమం.. మహిళలు ఇవి దృష్టిలో ఉంచుకోవాలి.. లేకుంటే మీ కళ్ళు పోయినట్లే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: