ఉద్యోగం చేసే మహిళలు వీటిని మరవకండి... సుమీ?

VAMSI
ప్రస్తుత జనరేషన్ లో దాదాపు మహిళలు అంతా ఆర్థికంగా కుటుంబానికి చేదోడువాదోడుగా అంటున్నారు. కొందరు ఉద్యోగాలు చేస్తుంటే, మరి కొందరు వ్యాపారాల్లో రాణిస్తున్నారు, ఇంకొందరు ఇంటి వద్దనే ఉంటూ వర్క్ ప్రం హోమ్ బేసిస్ మీద పలు రకాల పనులు చేస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తు కుటుంబానికి అండగా ఉంటున్నారు. ఆ రంగం ఈ రంగం అని తేడా లేకుండా పురుషులతో సమానంగా పోటీ పడుతూ అన్ని రంగాలలోను దూసుకుపోతున్నారు. ఎందరో మహిళలు ఇలా ఇంటా బయటా తమ సత్తా చాటుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే ఈ ఉరుకుల జీవిత ప్రయాణంలో తమ ఆరోగ్యం పై పెద్దగా శ్రద్ద చూపడం లేదనే చెప్పాలి.
తమ కుటుంబం గురించి, కెరియర్ గురించి మాత్రమే కాదు ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టడం ఎంతైనా అవసరం.  మానసికంగా, శారీరికంగా ఎంతగానో అలసిపోతున్న వారంతా..ఖచ్చితంగా కొన్ని ఆరోగ్య సూత్రాలను పాటించాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. రోజంతా ఇటు ఇంట్లోనూ అటు ఉద్యోగం లోనూ గంటల కొద్దీ పని చేసే మహిళలు శారీరికంగా ఫిట్ గా ఉండటం ఎంతో అవసరం. అలా ఫైట్ గా ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని చిట్కాలను పాటించాలని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇపుడు తెలుసుకుందాం.
* ఆహారంలో అధికంగా కాయగూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అన్నం తక్కువ కూరలు ఎక్కువ తినాలి.
* ఎక్కువ నీరును తాగుతూ ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి అంటే శరీరంలో 70 శాతం వరకు  నీరు ఉండాలి. అందుకే రోజు కు ఏడెనిమిది గ్లాసుల నీటిని తాగాలి. అంటే కనీసం రెండు,  మూడు లీటర్ల నీటిని తాగాలి.
 
* ప్రతిరోజూ ఉదయాన్నే కనీసం అరగంట పాటు అయినా వాకింగ్ చేయాలి. అలాగే యోగ  లేదా ద్యానం వంటివి కూడా  చేయాలి.
 
* ఎక్కువ సమయం కూర్చోని ఉద్యోగం చేసే వారు అప్పడప్పుడు లేచి నడుస్తూ ఉండాలి. మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉండే కూడా మంచి వ్యాయామం.
* రాత్రి పూట అన్నం త్వరగా తినేయాలి. కనీసం అరగంట పాటు చిన్న చిన్న పనులు చేస్తూ ఉండాలి. లేదా వాకింగ్ చేయడం కూడా మంచిది.
వీటిని పాటించకుండా అశ్రద్ధ చేస్తే మీ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: