మహిళ: రాత్రిళ్ళు తినకుండా పడుకుంటున్నారా?
ఎందుకంటే చాలా మంది స్త్రీలు పొద్దున లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు కూడా నిరంతరం వివిధ పనులతో బిజీగా కాలం గడుపుతుంటారు. ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ఇంట్లో ఆ వైపుకు ఈ వైపుకు తిరుగుతూ ఏదో ఒక పనిని చేస్తూనే ఉంటారు. ఇలా ఇంటి పనుల్లో పడి వారి ఆరోగ్యం గురించి పూర్తిగా విస్మరిస్తుంటారు. పొద్దున తినాల్సిన బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం తినడం వంటివి చేస్తూ ఉంటారు. కొందరైతే అలసిపోయి చాలా సార్లు అసలు ఏమి తినకుండానే ఖాళీ కడుపు తోనే నిద్రపోతుంటారు. కానీ అలా నిద్ర పోవడం ఎంత ప్రమాదమో తెలిస్తే మరో సారి అలా చేయరు.
మన మెదడుపై మానసిక ఒత్తిడి పెరుగుతుంది. గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలు ఎదురవుతాయి. జీర్ణవ్యవస్థ బలహీన పడుతుంది. రాత్రి సమయంలో భోజనం బదులు ఏదైనా ఇడ్లీ, ఉప్మా, చపాతీ 2, పాలు & బ్రెడ్, ఓట్స్ వంటి లైట్ ఫుడ్ తీసుకోండి. అది కూడా 8 లోపే తినడం మంచిది. చక్కగా జీర్ణం అవుతుంది.