ఆ విషయంలో మగవారికన్నా ఆడవారే టాప్ ?

VAMSI
నేటి ఆధునిక యుగంలో మహిళలు కూడా అన్ని రంగాలలో రాణిస్తూ ఇంట బయట తమ ప్రతిభను కనబరుస్తున్నారు. అన్ని పనులను చక్కబెడుతూ,ఇటు కుటుంబ బాధ్యతలను అటు వృత్తిని బ్యాలెన్స్ చేస్తూ మన్నలను పొందుతున్నారు. అయితే ఒక సర్వే ప్రకారం తేలింది ఏమిటంటే పురుషులతో పోలిస్తే మహిళలే ఎక్కువ గంటలు పని చేస్తున్నారు అని, సాధారణంగా మగవారు బయట ఉద్యోగం అని ఇతర పనులను తమ పనిని తాము చేసుకుని కష్టపడుతుంటారు. అయితే చాలా మంది మహిళలు తమ కుటుంబానికి ఆర్థికంగా ఎంతో కొంత సహాయపడటానికి ఉద్యోగాలు, సొంత వ్యాపారాలు చేస్తున్నారు. ఇలా వీరు వృత్తి రీత్యా పని చేసి మళ్ళీ తిరిగి ఇంటి పనులను కూడా చక్కబెడుతున్నారు.
ఈ రకంగా మగవారి కంటే మహిళలే అధికంగా పని చేస్తూ తమ గ్రేస్ ను చూపుతున్నారు. ఓ సర్వే ప్రకారం నేటి తరంలో ఎక్కువ మంది మహిళలు ఉద్యోగాలు చేయడమే కాదు. సొంతంగా వ్యాపారాలు చేసే వారు కూడా ఎక్కువవుతున్నారట. నిజంగా మహిళలు ఎంతైనా గ్రేట్ ఓ వైపు వృత్తి రీత్యా పని ఒత్తిడిని భరిస్తూనే మరో వైపు ఇంటి పనులను కూడా చేస్తూ ఎక్కువగా కష్ట పడుతున్నారు. ఈ పనులన్నింటి వలన రాత్రులు లేట్ గా నిద్రపోవడం, మళ్ళీ తెల్లవారుజామునే లేవడం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతే కానీ మహిళలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మరచిపోకండి. మంచి ఆహార పదార్థాలను తీసుకొని మరింత దృఢంగా అభివృద్ధి వైపు అడుగులు వేయండి.
ఇలా ఎప్పుడూ బిజీగా ఉండే మహిళలు తమ వద్ద ఒక పండును ఉంచుకోవడం మరవద్దు. అరటి పండు, యాపిల్, దానిమ్మ, నారింజ ఇలా ఈజీగా వెంటనే తినగలిగే అలాగే శక్తిని ఇచ్చే పండ్లను ఎంపిక చేసుకోండి. శక్తి తగ్గింది అనిపిస్తే ఆ పండును తినండి. తక్షణ శక్తి అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటారు...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: