బస్తీ బస్సుల్లో .. దొరసానే డ్రైవర్..

Chandrasekhar Reddy
మహిళలు అన్ని రంగాలలో రాణించడం చూస్తూనే ఉన్నాము. ప్రతీ రంగం వారికోసం స్వాగతం పలుకుతుండటం ఆహ్వానించదగ్గ పరిణామం. మహిళా సాధికారత దేశపురోభివృద్దికి చాలా అవసరం. నిన్న మెట్రో నేడు బస్తీ బస్సులలో మహిళా డ్రైవర్లుగా రాణిస్తూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఒకవైపు మహిళలపై అకృత్యాలు జరుగుతున్నప్పటికీ, ఇటువంటి సందర్భాలు ఆహ్వానించ దగ్గవి. అయితే ప్రతి రంగంలో మహిళలు ఉండటం వేరు, మొదటి అడుగు వేసిన వారు వేరు. ఎంతైనా ధైర్యంగా మొదటి అడుగు వేసిన వారు ఖచ్చితంగా ప్రత్యేకతను చాటుకుంటారు. అలా మొదటి మహిళా బస్సు డ్రైవర్ మనోగతం గురించి తెలుసుకోడానికి ప్రయత్నిద్దాం.
ఆమె పేరు రితూ నర్వాల్, మొదటి మహిళా బస్ డ్రైవర్. ఈమె మధ్యప్రదేశ్ లో తమ విధులను నిర్వర్తిస్తున్నారు. సాధారణంగా బాగా ట్రాఫిక్ ఉన్న చోటు రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం కారిడార్ లో ఆమె తన మొదటి ట్రిప్ ను రాజీవ్ గాంధీ స్క్వేర్ నుండి నిరంజన్ పూర్ స్క్వేర్ వరకు నడిపి ప్రయాణికులను గమ్యానికి చేర్చారు. అయితే బస్సులలో మహిళా ప్రయాణికుల రద్దీని పెంచేందుకు ఇటీవల ప్రారంభించిన పింక్ బస్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. దానిలో భాగంగా ఈమె తన మొదటి ట్రిప్ విజయవంతంగా పూర్తిచేసింది.
దీనికోసం ఇద్దరు మహిళా డ్రైవర్ లకు శిక్షణ ఇవ్వడం జరిగింది. శిక్షణ పూర్తిచేసుకున్న నర్వాల్ తన ట్రయల్ ను విజయవంతంగా పూర్తిచేసింది. సోమవారం నుండి ఈ ఇద్దరు మహిళా డ్రైవర్లు తమ సాధారణ విధులను నిర్వర్తిస్తారని సదరు అధికారి స్పష్టం చేశారు. ఇప్పటికే మహిళా కండక్టర్స్ ఉన్నారని, ఇంకా అవసరాన్ని బట్టి డ్రైవర్స్ మరియు కండక్టర్స్ సంఖ్యను పెంచుతామని ఆయన వెల్లడించారు.
తాను ఎప్పటికైనా హెవీ వెహికల్ డ్రైవర్ కావాలన్న తన కల ఇప్పటికి తీరిందని నర్వాల్ తన అనుభవాన్ని పంచుకున్నారు. తన బస్సులోని ప్రయాణికులను సురక్షితంగా గమ్యాలకు చేర్చడం  తన వంతు కర్తవ్యమని దానిని విజయవంతంగా నిర్వర్తిస్తానని ఆమె చెప్పారు. మరో మహిళా డ్రైవర్ అర్చనా కాటేరా గతంలో ఒక ఫైవ్ స్టార్ హోటల్ కు డ్రైవర్ గా పనిచేశారు. కోవిడ్ కారణంగా ఆ ఉద్యోగం పోయిందని, ఇప్పుడు పింక్ బస్ డ్రైవర్ గా విధులు నిర్వర్తించ బోతున్నట్టు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: