అమ్మ: ఇరవై ఏళ్ల వయస్సులో పిల్లలను కనొచ్చా..??
అయితే ఇరవై ఏళ్ల వయసులో స్త్రీలలో పునరుత్పత్తి వ్యవస్థ చాలా యాక్టివ్ స్థితిలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ సమయంలో ప్రెగ్నెన్సీ కావడం చాలా సులువు అని అన్నారు. కాగా.. ఈ వయసులో స్త్రీల అండాశయంలో ఉండే 90 శాతం అండాలు నార్మల్ గా ఉంటాయని తెలిపారు. దాంతో ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అంతేకాక.. 24 సంవత్సరాల వయసులో స్త్రీలలో పునరుత్పత్తి వ్యవస్థ చాలా హైలో ఉంటుందని చాలా పరిశోధనలు వెల్లడించారు. కానీ.. ఈ వయసులో స్త్రీలు నెలసరి వచ్చినపుడు గర్భం దాల్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
ఇక ఇదిలా ఉంటే.. ఇక మరో వర్గం స్త్రీలు వారి కెరియర్ ను దృష్టిలో పెట్టుకుని పిల్లలను కనడం వాయిదా వేసుకుంటూ ఉంటారు. అయితే అలాంటి వారు ఏ వయసులో పిల్లలు కనగలమని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక.. పెళ్లైన కొత్తలో జాబ్ చేయడం వలన కెరీర్ గురించి ఆలోచించి పిల్లలను కనడం మానేస్తుంటారు. కాగా.. కొన్ని సంవత్సరాలు గడిచే సరికి పిల్లలను కనాలని అనుకుంటూ ఉంటారు. అయితే అటువంటి సమయంలో వారికి అనేక సందేహాలు తలెత్తున్నాయి.
కాగా.. అసలు ఏ ఏజ్ లో ప్రెగ్నెన్సీ వస్తుందనే విషయం గురించి వెతుకుతుంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాక.. దీనిపై నిపుణుల సలహాలు సూచనలు చాలా అవసరం అని తెలిపారు. ఇక ప్రస్తుత సమయంలో లేట్ వయసులో ప్రెగ్నెన్సీ కోసం ఆలోచించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుందని అన్నారు. అయితే దీనికి ప్రధాన కారణం పెళ్లైన కొత్తలో జీవితంలో సెటిల్ కావాలని ఆలోచించి భార్యా భర్తలు పిల్లలను కనకుండా ఉంటున్నట్లు తెలిపారు.