నాడు వెక్కిరించిన వాళ్ళే నేడు మెచ్చుకుంటున్నారు

Mamatha Reddy
ఆడవారికి అడుగడుగునా అవమానాలు, ఛీత్కారాలు ఇంకా ఎదురవుతూనే ఉన్నాయి. వారు అట్టడుగు స్థాయిలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ అవహేళన చేసే వారే. కానీ జీవితంలో ఏదో ఒకటి సాధించిన తర్వాత అందరూ పొగుడుతారు. విమర్శించే నోళ్ళు ప్రశంసిస్థాయి. అలా అట్టడుగు స్థాయిని నుంచి ఎదిగి ఇప్పుడు భారతదశ గౌరవాన్ని ప్రపంచమంతా చాటి చెప్పింది 18 సంవత్సరాల కృష్ణ జయ శంకర్. డిస్క్ త్రోయర్ క్రీడాకారిణిగా దేశంలోనే అత్యధిక ఉపకార వేతనాన్ని అందుకున్న ఈమె ఎత్తు ఎక్కువగా ఉండడం మూలంగా పలువురితో విమర్శల పాలైంది.

ఎంతోకాలం అవమానాలు ఎదుర్కొని ఇప్పుడు పలువురు అమ్మాయిలకు ఆదర్శంగా నిలిచింది. తల్లిదండ్రుల ప్రేరణతో క్రీడల్లో మక్కువ చూపిన ఆమె రైల్వే సౌత్ జోన్ క్రీడాకారులకు బాస్కెట్ బాల్ కోచ్ గా పనిచేసే అమ్మే తనకు ప్రేరణ అని చెప్పింది. కోటిన్నర ఉపకార వేతనం అందుకునే ఈమె నువ్వసలు అమ్మాయిలానే లేవు ఇంత పొడవు ఉన్నావ్ ఏంటి అని ఎన్నో రకాల అవమానాలు ఎదుర్కొంది. అమ్మ నాన్న నుంచి కృష్ణకు పొడవు దేహదారుడ్యం వచ్చాయి. అవి చిన్నప్పటీ నుంచి ఆమెకు శాపంగా మారుతున్నాయి. బడిలో తోటి పిల్లలు ఇంత పొడవు ఉన్నావేంటి అనేవారు. తనతో కలిసే వారు కాదు. చదువులో ముందున్న పొడువు కారణం గా వెనుక బెంచి విద్యార్థిని గా మారి పోవాల్సి వచ్చింది. 

తను ఎందుకు అందరికన్నా పొడవు గా ఉన్నానో తెలియక కుంగుబాటుకు గురయ్యేది కృష్ణ. కృష్ణ కుటుంబం అంతా క్రీడాకారులు కావడంతో ఆమెకు మెల్లమెల్లగా ఆటలపై దృష్టి మళ్ళింది. క్రీడల్లో అడుగుపెట్టాలనుకును టెన్నిస్ ఆడటం మొదలు పెట్టింది. ఆ తర్వాత బ్యాడ్మింటన్ ఆడింది. అయితే  వీటిలో ఆమెకు ఏదీ పెద్దగా ఆసక్తి పెరగలేదు. అప్పటికే 5.3 అడుగుల ఎత్తులో ఉండే తనను 5వ తరగతి లో మాస్టారు షాట్ ఫుట్ లో చేరమని ప్రోత్సహించారు.  ఫీల్డ్ కోచ్ ఒకరు డిస్కస్ కు శారీరక దారుఢ్యం ఉందని సలహా ఇవ్వడంతో 2018లో ఈ క్రీడను ఎంచుకుంది. ఆ తర్వాత ఆ క్రీడలో శిక్షణ తీసుకొని ప్రపంచమంతటా రికార్డులు సృష్టిస్తూ వచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: