అమ్మ: త్వరగా గర్భం దాల్చాలనుకుంటున్నారా ఇలా చేయండి..?

N.ANJI
నేటి సమాజంలో చాలా మంది సంతాన లేమి సమస్యతో బాధపడుపడుతున్నారు. అలాంటివి వారికీ గర్భం తొందరగా ధరించాలంటే ఈ చిట్కాలను పాటించండి. గర్భధారణ పొందాల్సిన మహిళలకు ఐరన్ చాలా చాలా అవసరం. అయితే సాధారణంగా మన శరీరానికి అవసరమైన దాని కంటే గర్భం దాల్చిన తర్వాత రెట్టింపు ఐరన్ కావాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అయితే కణాల నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక బిడ్డ ఎదగడానికి కణ నిర్మాణం చాలా కీలకం అని అంటున్నారు. అంతేకాదు.. గర్భంతో ఉన్నప్పుడు శారీరకపరమైన ఎన్నో మార్పులకు ఐరన్ దోహదపడుతుంది. అంతేకాక.. రక్తపరిమాణాన్నీ పెంచుతుంది. అలాగే ఐరన్ లోపిస్తే ముందస్తు ప్రసవానికి దారి తీయొచ్చునని అన్నారు. ఇక తక్కువ బరువుతో బిడ్డ పుట్టొచ్చు. అందుకే గర్భం దాల్చిన వారు తప్పకుండా రక్తపరీక్ష ద్వారా ఐరన్ ఎంతున్నది తెలుసుకోవడం అవసరం అని అన్నారు.
ఐరన్ ఎక్కువగా పాలకూర, క్యాలీఫ్లవర్, గుమ్మడికాయ, టమాటాలు, బీట్ రూట్, మష్ రూమ్స్, బీన్స్, పప్పు ధాన్యాలు, పుచ్చకాయ, ద్రాక్ష, కమలా, నారింజ, యాపిల్స్, స్ట్రాబెర్రీ, ముడి ధాన్యాల్లో ఐరన్ తగినంత దొరుకుతుంది. ఇక మాంసాహారమైన చికెన్, మటన్ లోనూ ఐరన్ సమృద్ధిగా లబిస్తుంది. అంతేకాక.. మాంసాహార పదార్థాల్లో ఉండే ఐరన్ ను అంత తేలిగ్గా శరీరం గ్రహించలేదన్నారు. అంతేకాదు.. విటమిన్ సీ సప్లిమెంట్లను తీసుకోవాలని అన్నారు. దాంతో ఐరన్ ను శరీరం తేలిగ్గా గ్రహించగలదని అంటున్నారు.
ఇక తల్లి కావాలనుకునే ప్రతి మహిళకూ అత్యంత అవసరమైన ఫోలిక్ యాసిడ్ చాలా అవసరం. అయితే గర్భంలో శిశువు ఎదుగుదలకు ఇది అత్యంత కీలక పాత్ర వహిస్తుంది. ఇది వెన్నుపాము, మెదడుకు సంబంధించి పుట్టుకతో వచ్చే లోపాలను నివారిస్తుంది. అంతేకాదు.. వెన్నుపాము, మెదడుకు సంబంధించి పుట్టుకతో వచ్చే లోపాలను  రాకుండా చూస్తుంది. ఇక ఫోలిక్ యాసిడ్ తృణధాన్యాలు, బీన్స్, అరటిపండ్లు, బెర్రీస్, ఆకుపచ్చని కూరగాయలు, మష్ రూమ్, మొక్కజొన్న, క్యారట్లు, క్యాలీఫ్లవర్, పాలకూర, మెంతికూర, పుదీనా, కాకరకాయ, సొరకాయ, బెండకాయ, క్యాప్సికమ్, బీట్ రూట్, క్యాబేజీ వంకాయలో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా దొరుకుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: