అమ్మ: ప్రెగ్నెన్సీ లక్షణాలను ఇలా గుర్తించండి..?

N.ANJI
సాధారణంగా మొదటిసారి గర్భధారణ గురించి ఎవరికీ తెలియదు. అయితే ప్రెగ్నెసీ గురించి ఇలా తెలుసుకోండి. ఇక అండం శుక్ర కణంతో ఫలదీకరణ జరిగినప్పుడు గర్భదారణ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అయితే తొలి రెండు వారాల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. పీరియడ్ మిస్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ లక్షణాలు తెలుసుకోవడం ద్వారా మీకు ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా పసిగట్టవచ్చునని అన్నారు. అయితే అందరికీ ఈ లక్షణాలు కనిపించవు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇక ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో తెలుసుకోవడానికి మెడికల్ షాపులు లేదా ఆన్ లైన్ ఫార్మా స్టోర్లలో టెస్ట్ కిట్ లభిస్తుంది. కిట్ పై ఉన్న సూచనలకు అనుగుణంగా యూరిన్ డ్రాప్స్ ఈ పరికరంలో వేసి చుస్తే ప్రెగ్నెసీ అవునా, కదా అనేది తెలిసిపోతుంది. అయితే ప్రెగ్నెసీ అని ఎన్ని రోజులకు తెలుస్తుంది. అయితే ప్రెగ్నెన్సీ లక్షణాలు ఎలా ఉంటాయో ఒక్కసారి చూద్దామా.
అయితే పీరియడ్ మిస్ అయిన వారం రోజుల్లోనే టెస్ట్ కిట్ ద్వారా ఫలితం తెలుసుకోవచ్చున్నారు. ఇక కొందరిలో ఇది రెండు వారాలు పట్టొచ్చు. ప్రెగ్నెన్సీ కొన్ని లక్షణాలను బట్టి తెలుసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  అంతేకాదు.. కొందరికి ఫలదీకరణ చెందిన అండం గర్భాశయానికి అతుక్కుంటున్న సందర్భంలో స్పాటింగ్ కనిపిస్తూ ఉంటుంది. ఒక్క రకంగా చెప్పాలంటే..  చిన్నపాటి రక్తపు మరక ల ఉంటుంది. ఇక దీనిని ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అని కూడా అంటారు.
అంతేకాదు.. అండం ఫలదీకరణ చెందిన ఆరు రోజుల నుంచి 12 రోజుల మధ్య ఇలా జరుగుతుందని చెప్పారు. అయితే అందరికీ ఇలా జరగాలని లేదని అన్నారు. ఇక ఇదే సమయంలో యోని గోడలు దళసరిగా మారుతున్నప్పుడు తెల్లని స్రావాలు కూడా విడుదల అవుతాయని అన్నారు. అంతేకాక.. ప్రెగ్నెన్సీ వస్తే హార్మోన్ల స్థాయిల్లో మార్పులు వస్తాయని తెలిపారు. ఇక అదే సమయంలో బ్రెస్ట్ (రొమ్ము) వాపుగా, కాస్త నొప్పిగా వంటివి వస్తుంటాయి. అంతేకాదు.. . కొందరికి తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: