అమ్మ: ఈ సమస్యలు ఉన్న గర్భిణులు వ్యాయామం చేయకూడదా..?
ఇక ఒక్కవేళ మీకు ఇంతకుముందే 9 నెలల కంటే ముందే డెలివరీ అయితే, రెండో గర్భాధారణ సమయంలో కఠినమైన వ్యాయామాలు చేయకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి వారు ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవాలి వైద్యులు చెబుతున్నారు. ప్రీమెచ్యూర్ డెలివరీ అయినా వారు ఒక్కవేళ వ్యాయామం చేయాలనుకుంటే డాక్టర్ ని సంప్రదించాలని చెబుతున్నారు. ఇక తేలికపాటి నడక వంటి కొన్ని సులభమైన వ్యాయామ పద్ధతులను వారికీ సూచిస్తున్నారు.
సాధారణంగా గర్భధారణ సమయంలో కొంతమంది మహిళలకు రక్తస్రావం జరుగుతుంది. అయితే అలాంటి వారు తొమ్మిది నెలల పాటు తప్పనిసరిగా అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే గర్భస్రావం సమస్య తలెత్తకుండా ఉండటానికి గర్భందాల్చిన మొదటి 12 వారాల పాటు వ్యాయామం చేయకుండా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ వ్యాయామం చేయాలనుకుంటే మీ వైద్యుడిని సంప్రదించడం మంచిదని అంటున్నారు.
ఇక గర్భాశయ సమస్యలు ఉన్న మహిళలు ఏవైనా కఠినమైన శారీరక శ్రమ లేదా వ్యాయామం చేస్తే అది రక్తస్రావానికి దారితీస్తుందని చెబుతున్నారు. అలాంటి వారు వ్యాయామం చేయకపోవడమే మంచిది అని చెబుతున్నారు నిపుణులు. ఇక గర్భాశయ సంబంధ సమస్య ఉన్న మహిళలు గర్భం దాల్చిన మొదటి మూడు నెలలు అదనపు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. డాక్టర్ సలహా మేరకే వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు.