క‌రోనా పెషెంట్స్ కి ఫ్రీఫుడ్ ....మాన‌వ‌త్వం చాటుతున్న డిజైన‌ర్‌

N.V.Prasd
క‌రోనా పెషెంట్స్ కి  ఫ్రీఫుడ్ ....మాన‌వ‌త్వం చాటుతున్న డిజైన‌ర్‌
హైద‌రాబాద్ : క‌రోనా మ‌హామ్మారి అయిన‌వారిని సైతం దూరం చేస్తుంది. వృద్దాప్యంలో ఉన్న వారు క‌రోనా బారిని ప‌డితే క‌న్నవారు కూడా ప‌ట్టించుకోని ప‌రిస్థితులు మ‌నం నిత్యం చూస్తున్నాం.అయితే ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో కొంత మంది స్వ‌చ్ఛంధ సంస్థ‌ల వారు స‌హాయం చేయ‌డానికి ముందుకు వ‌స్తున్న‌ప్ప‌టికీ ఒకటి రెండు రోజులే ఆ స‌హాయం అందుతుంది.కానీ హైద‌రాబాద్ కి చెందిన ఓ డిజైన‌ర్ మాత్రం రెండు పూట‌లా  ప్ర‌తి రోజు వంద‌మందికి ఉచితంగా భోజ‌నం అందిస్తున్నారు.ఈ ఫ్రీఫుడ్ లో మెనూ కూడా అల్లాట‌ప్పాగా లేదు... ఆ మెనూ చూస్తే ఎవ‌రైనా షాక్ అవ్వాల్సిందే...ఇంత‌కీ ఆ డిజైన‌ర్ ఎవ‌రు..? ఆ మెనూ క‌థేంటో తెలుసుకుందాం.
అనంత‌పురంకి చెందిన నిహారిక రెడ్డి హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు.ఈమె వృత్తి డిజైన‌ర్ కానీ సాయం చేయాలంటే ముందువ‌రుస‌లో ఉంటారు.ఏడాదిగా క‌రోనాతో అనేక మంది రోడ్డున‌ప‌డ్డారు.కొన్ని కుటుంబాలైతే క‌నుమ‌రుగైన ప‌రిస్థితి ఏర్ప‌డింది.ఈ స‌మ‌యంలో బాధితుల‌కు అండ‌గా ఉండాల‌ని నిహారిక నిర్ణ‌యించుకుంది.క‌రోనా ప్రారంభ స‌మ‌యంలో లాక్ డౌన్ కార‌ణంగా ఇబ్బందులు ప‌డుతున్న పేద‌ల‌కు ఉచితంగా నిత్య‌వ‌స‌ర‌వ‌స్తువులు అందించారు.ఇప్పుడు సెంక‌డ్ వేవ్ తో చాలా మంది క‌రోనా బారిన ప‌డి భోజ‌న స‌దుపాయం లేక ఆక‌లితో ఆల‌మ‌టిస్తున్నారు.వీరి ఆక‌లి తీర్చేందుకు నిహారిక మ‌రో అడుగు ముందుకు వేశారు.కోవిడ్ పాజిట‌వ్ వ‌చ్చి ఆహారానికి ఇబ్బంది ప‌డేవారి కోసం త‌న ఇంట్లోనే భోజ‌నం త‌యారు చేసి ఉచితంగా వారి ఇంటికే వెళ్లి ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు.హైద‌రాబాద్ లోని యూస‌ఫ్‌గూడ‌,శ్రీన‌గ‌ర్ కాల‌నీ,జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మ‌ధురాన‌గ‌ర్‌,ఎల్లారెడ్డిగూడ‌,స‌న‌త్ న‌గ‌ర్ ఏరియాల్లో ఉంటున్న పేద‌వారికి రెండూపూట‌లా పౌష్టికాహారిన్ని అందిస్తున్నారు.క‌రోనా పాజిటివ్ వ‌చ్చి ఫుడ్ కి ఇబ్బంది ప‌డుతున్న వారు ఒక రోజు ముందుగా 9701821089 కి కాల్ చేసి లోకేష‌న్ షేర్ చేస్తే టైంకి ఫుడ్ అందిస్తామ‌ని నిహారిక తెలిపారు.
ప్ర‌తిరోజు సూప‌ర్ మోనూ...
త‌మ ఇంట్లో ఏ ఫ‌డ్ అయితే తింటారో దానినే క‌రోనా పెషెంట్స్ కి అందిస్తున్నారు.వెజిట‌బుల్ ప‌లావ్‌, ప‌న్నీర్ క‌ర్రీ,చ‌పాతీ,రైస్‌,బీట్రూట్ ఫ్రై, కీరా, క్యారెట్‌,ర‌సం,జీరా రైస్‌,ఇమ్యూనిటీ చాక్లెట్‌, డ్రైఫ్రూట్స్ లాంటి ఐట‌మ్స్ తో  ఆహారాన్ని త‌యారు చేసి బాధితుల ఆక‌లి తీరుస్తున్నారు.ఈ మెనూని త‌యారు చేయ‌డానికి ఇంట్లోని వారంతా తెల్ల‌వారుజామున నాలుగు గంట‌ల‌కే లేచి ప‌నిలో నిమ‌గ్న‌మ‌వుతారు.ఫుడ్  ప్రిపేర్ అయ్యారు వాటిని ప్యాక్ చేసి కారులో తీసుకెళ్లి ఎవ‌రెవ‌రికి ఇవ్వాలో వారంద‌రికి ఇచ్చి వస్తారు.మ‌ళ్లీ సాయంత్రం నాలుగు గంట‌ల నుంచి డిన్న‌ర్ కి అవ‌స‌ర‌మైన ఫుడ్ ని ప్రిపేర్ చేస్తారు.ఇలా క్ష‌ణం తీరిక లేకుండా నిహారిక రెడ్డి ఆమె కుటుంబం క‌ష్ట‌ప‌డుతూ ప‌దిమంది ఆక‌లితీర్చి క‌లియుగ అన్న‌పూర్ణాదేవగా పేరు తెచ్చుకుంటున్నారు.అయితే తాము ఇచ్చిన ఫోన్ నెంబ‌ర్ కి కొంత‌మంది ఆక‌తాయిలు ఫోన్ చేస్తూ త‌మ‌కు అవ‌స‌రం లేక‌పోయిన ఫుడ్ కావాలంటూ విసిగిస్తున్నార‌ని ఆమె వాపోతున్నారు.ద‌యచేసి ఇలాంటి మంచి ప‌ని చేస్తున్న‌వారిని ఇబ్బంది పెట్ట‌కుండా మిగిలిన వారు కూడా త‌మ‌కు న‌చ్చిన స‌హాయాన్ని బాధితుల‌కు అందించాల‌ని నిహారిక రెడ్డి కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: