గాంధీ vs గాంధీ.. కాంగ్రెస్ ని దెబ్బకొట్టేందుకు బిజెపి వ్యూహం?
అటు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న రాయ్ బరేలి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెబల్ అభ్యర్థి వరుణ్ గాంధీని బరిలోకి దింపాలని బిజెపి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది. ఇందుకోసం ఇప్పటికే కాషాయ పార్టీ సంప్రదింపులు కూడా జరిపిందట. అయితే అటు బిజెపి ప్రతిపాదనను మాత్రం వరుణ్ గాంధీ తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. సాధారణంగా అయితే రాయ్ బరేలి నుంచి అటు సోనియా గాంధీ పోటీ చేస్తూ ఉంటారు. 2004 నుంచి ఆమె అక్కడ ఎంపీగా గెలుస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆమె ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుని రాజ్యసభ కు వెళ్లడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది. అయితే సోనియా ఈసారి ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవడంతో.. ప్రియాంక గాంధీని ఇక్కడి నుంచి బరిలోకి దింపేందుకు హస్తం పార్టీ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది అంటూ వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టేందుకు కాషాయ పార్టీ వ్యూహాలు పన్నింది. రాహుల్ గాంధీ సోదరుడైన వరుణ్ కాంగ్రెస్కు పోటీగా నిలబెట్టేందుకు సిద్ధమైంది. కానీ బిజెపి వ్యూహం మాత్రం ఫలించలేదు అన్నది తెలుస్తోంది. గాంధీ వర్సెస్ గాంధీ పోటీ ఉండకూడదు అని అటు వరుణ్ అనుకుంటున్నాడట. అందుకే ఇక పోటీ నుంచి తప్పుకున్నాడు అనేది తెలుస్తుంది. వాస్తవానికి వరుణ్ గాంధీ ఫీలిబిత్ సిట్టింగ్ ఎంపీ. 2024 లోక్సభ ఎన్నికల్లో ఆయనకు బిజెపి మొండి చేయి చూపించింది. అతని సిట్టింగ్ స్థానంలో యూపీ మాజీ మంత్రి జితిన్ ప్రసాద్కు అవకాశం కల్పించింది. ఇక వరుణ్ తల్లి మేనక గాంధీకి సుల్తాన్పూర్ ను ఖరారు చేసింది. దీంతో ఆయన సొంత పార్టీపై విమర్శలు కూడా చేయడం మొదలుపెట్టారు. మరి రానున్న రోజుల్లో రాయ్ బరేలి నుంచి పోటీ చేసేందుకు వరుణ్ గాంధీని బిజెపి అధిష్టానం ఒప్పిస్తుందో లేదో చూడాలి.