జపనీస్ స్కూల్ గర్ల్స్ ల స్కూల్ డ్రెస్ ఎందుకు అంత షార్ట్ గా ఉంటాయో తెలుసా..!!

Mamatha Reddy
స్కూల్ అంటేనే సంస్కారాన్ని, క్రమశిక్షణ నీ నేర్పే ఓ పాఠశాల.. ఆడవారు భవిష్యత్తులో ఎలా మెలగాలి, మగవారు ఆడవారి పట్ల ఎలాంటి భావం చూపించాలి అనే ప్రక్రియను ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది పాఠశాల. అలాంటి పాఠశాలలో స్కట్ లకు, ఎక్స్ పోజింగ్ చేసే విధంగా ఉండే బట్టలకు ఏ విధంగానూ తావులేదు.. కానీ జపనీస్ స్కూల్ లలో మాత్రం విద్యార్థులు తొడలు కనిపించేలా బట్టలు వేసుకుంటూ కనిపిస్తుంటారు.. దీనికి ఏదైనా కారణం ఉందా లేదా కావాలనే ఇలా చేస్తారా అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
మన సినిమాల్లో, సోషల్ మీడియాలోని కొన్ని వీడియోలో చూస్తుంటాం జపనీస్ విద్యార్థులు చాలా తక్కువ లెంత్ తో కూడిన బట్టలు వేసుకుని కనిపిస్తూ ఉంటారు..వారి మోకాలికి స్కర్ట్ కి మధ్య 25 సెంటి మీటర్ల దూరం ఉంటుంది.  అంత దూరం అంటే చాలా వరకు ఎక్స్ పొజ్ అవుతూనే ఉంటుంది.. అయిన అదేమీ పట్టించుకోరు వారు.. ఈ ట్రెండ్ జపనీస్ లో 1990 మొదలైందట. అప్పటి పాప్ సింగర్ ఆయన అమురో ఈ ట్రెండ్ ని మొదలు పెట్టిందట.. ఈ స్కర్ట్స్ ఎంతో క్యూట్ గా ఉండడంతో జపనీస్ గర్ల్స్ దీన్ని ఫ్యాషన్ గా ఎంచుకున్నారట..
అప్పటి నుంచే వీటిని యూనిఫామ్స్ గా కూడా ఎంచుకున్నారట అక్కడి గర్ల్స్.. అయితే ఇలాంటి బట్టలు వేసుకోవడం అక్కడి పాఠశాల నియమాలకు విరుద్ధమే అయినా చాలామంది ఇలాంటి వాటిని వేసుకోవడం తో  ఏమీ అనలేకపోయిందట పాఠశాల యాజమాన్యం.. గతంలో పొడుగాటి స్కట్స్ నీ మాత్రమే ఉపయోగించేవారు ఆ తర్వాత క్రమక్రమంగా షార్ట్ స్కర్ట్ ని ఉపయోగించడం మొదలు పెట్టారట విద్యార్థులు.. ఇప్పటికీ కొంతమంది పొడవాటి స్కర్ట్స్ వేస్తే వారిని ఎడిపిస్తారట అక్కడి విద్యార్థులు.. ఈ షార్ట్ స్కట్స్ వేసుకోవడం వల్ల ఎంతో అందంగా, క్యూట్ గా కనిపిస్తారని అక్కడ వారి నమ్మకం.. అందుకే దీన్ని ఉపయోగించడానికి ఎక్కువగా వారు మక్కువ చూపిస్తారట..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: