అమ్మ: మీకు పుట్టబోయేది పాపా.. బాబా..? తెలుసుకోవాలంటే..!?

N.ANJI
గర్భవతిగా ఉన్నప్పుడు పుట్టబోయేది పాపా లేదా బాబా అనే విషయాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. మొదట్లో ఆస్పత్రుల్లో ప్రత్యేక పరీక్షలు నిర్వహించిన తర్వాత తెలుసుకునే వారు. కడుపులో పెరుగుతున్నది ఆడ పిల్ల అని తెలిసి చాలా మంది గర్భంలోనే చంపేసేవారు. దీంతో ప్రభుత్వాలు కూడా కఠిన ఆంక్షలు విధించాయి. గర్భంలో ఉంది పాపా.. బాబా అనేది తెలుసుకోవడానికి చేసే పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అయితే చాలా మందికి పుట్టబోయేది ఆడపిల్లా.. మగ పిల్లాడా అని తెలుసుకోవాలని ఆతురత అలానే ఉంది. దీనికి నిపుణులు ఓ సలహా ఇస్తున్నారు. గర్భంతో ఉన్న స్త్రీ యూరిన్ రంగు ప్రకాశవంతంగా పసుపు వర్ణంలో ఉంటే పుట్టబోయేది బాబని, అలాకాకుండా ముదురు పసుపు రంగులో యూరిన్ వస్తే అమ్మాయి పుడుతుందని తెలిపారు.


గర్భిణీగా ఉన్నప్పుడు మహిళలకు ఎన్నో రకాల ఆలోచనలు, ఒత్తిడికి లోనవడం జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఉన్నట్టుండి గర్భిణులకు కోపం రావడం కూడా జరుగుతుంది. అధికారం చెలాయిస్తూ ఉండటం, నాకెందుకులే అనుకుంటూ ఉన్నట్లయితే అబ్బాయి పుట్టబోతున్నట్లు, అదే డల్‌గా ఉండటం, చిరాకుగా ఉన్నట్లు కనిపిస్తే మీ ఇంట్లోకి  అమ్మాయి రాబోతుందని సూచనలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. పూర్వీకులు ఎన్నో ఏళ్లుగా ఫాలో అవుతున్న చిన్న చిన్న చిట్కాలు ఇవి. వీరి అనుభవాల ఆధారంగా గర్భిణీగా ఉండే మహిళ ఆడపిల్లను లేదా మగపిల్లాడిని జన్మనిస్తుందనే విషయం తెలుస్తుందని, అంతే కానీ పుట్టబోయేది కచ్చితంగా వీళ్లే అని చెప్పలేమని వారు పేర్కొన్నారు.


కొందరు వ్యక్తలు ఆడపిల్ల పుట్టిన, మగ పిల్లాడు పుట్టినా దానికి కారణం స్త్రీ మాత్రమే అని అపోహ పడుతుంటారు. వీరే జన్మనిస్తారు కాబట్టి.. వీళ్లు అనుకోవడం వల్లే ఆడపిల్ల పుట్టిందని భావిస్తుంటారు. అయితే పురుషుల్లో ఉత్పత్తి అయ్యే శుక్రకణాలు సగం ఎక్స్ క్రోమోజోములు, మిగితా సగం వై క్రోమోజోములుగా ఉంటాయి. ఆడవాళ్లలో మాత్రం ఒకే రకం (ఎక్స్) అండ కణాలు ఉత్పత్తి అవుతాయి. ఎప్పుడైతే అండకణం మగవారి ఎక్స్ శుక్రకణాలతో ఫలదీకరణం చెందుతుందో అప్పుడు ఆడ పిల్లగా, అండకణాలు మగవారి వై శుక్రకణాలతో ఫలదీకరణం చెందితే మగ పిల్లాడు జన్మిస్తాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: