నాన్న వదిలేశాక.. అమ్మ కష్టాన్ని చూసి డిసైడ్ అయ్యాను.. !!

Mamatha Reddy
చాలామందికి బాల్యం అంటే తీపి జ్ఞాపకం.. కొంతమందికి బాల్యం అంటే నరకం.. పిల్లలు ఎంతటి ఎత్తు ఎదగాదానికైన తల్లిదండ్రులే కారణం అవుతారు. అలాగే వారు మంచి మార్గంలో నడవలన్నా, చెడు దారులకు పోకుండా ఉండాలన్న వారు వెన్నంటి ఉంది మంచి బుద్ధులు నేర్పాలి.. అలాంటి తండ్రి లేకపోతే ఎ పిల్లలకైన అది నరకం లాంటి బాల్యం అని చెప్పాలి.. అలా ఓ అమ్మాయి జీవితంలో నరకం లాంటి ఓ పార్ట్ ని వెల్లడించింది.. తనకు ఐదేళ్ళ వయసులో ఆఫీస్ కి వెళ్ళిన నాన్న తిరిగిరాలేదు. ఒకటి రెండు రోజులు ఎదురు చూసిన తర్వాత అప్పుడు డిసైడ్ అయ్యారట తానింకా తిరిగి రాడని..
తన బాధ్యత ను, భుజాన వేసుకుని అమ్మ ఆపని ఈపని చేసింది.. అప్పుడు సరిగ్గా ఆరునెలల తర్వాత నాన్న ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పుడు అమ్మ కష్టం తీరిందా అంటే లేదు ఎక్కువయ్యింది.. నాన్న ఉద్యోగానికి వెళ్తున్న జీతం మాత్రం ఇంట్లో ఇవ్వట్లేదు.. అన్నీ అమ్మే చూసుకునేది. నేను అక్క అమ్మకి హెల్ప్ చేసేవాళ్ళం.. మా నాన్న ని వాచ్ కోసం డబ్బు అడిగితే ఐదు రూపాయలు చేతిలో పెట్టి ఆడవారికి వాచ్ కొనుక్కునే అర్హత లేదన్నారు.. ఇదే విషయం అమ్మకి చెప్తే సాయంత్రం వాచ్ కొనుకున్ని మీ నాన్నకి చూపించు అని చెప్పింది. వాచ్ పెట్టుకోవడానికి ఆడమగ తేడా ఎంతని నిరూపించు అని చెప్పింది.
వాచ్ విషయంలోనే కాదు మా చదువు గురించి, ఉద్యోగం గురించి మా అమ్మ చాలా పోరాటం చేయాల్సి వచ్చింది. నా మొదటి నెల జీతం అమ్మ చేతికి ఇచ్చా.. ఆ తర్వాత పై చదువులు చదువుకున్న.. ఓపెద్ద ఇంటర్వ్యూ లో ఓ ప్రశ్న అడిగారు. నీ డ్రీం ఏంటి అంటే నేను ఇంటర్నేషనల్ స్థాయికి ఎదగాలని బదులు చెప్పా. అందరు నవ్వారు.. అనుకున్నట్టుగానే కలలు నిజం చేస్కున్నాను..కంపెనిలో అంచెలంచెలుగా ఎదిగాను.. అమ్మకి ఒక ఇల్లు బహుమతిగా ఇచ్చాను.. మా అమ్మ కష్టాన్ని చూసినప్పుడే డిసైడ్ అయ్యా.. నేను మంచి పొజిషన్ లోకి వెళ్ళాలని.. ప్రస్తుతం తనలాగా కష్టపడే వారికి ఓ NGO ద్వారా సేవలందిస్తుంది ఆమె..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: