మామ పనిచేసిన చోటే ఉన్నతమైన హోదాలో ఆసీనురాలైన కోడలు. ఇంతకీ ఆమె ఎవరు?
అన్నింట్లోనూ వైసీపీ పార్టీ విజయ ఢంకా మోగించింది. ఈ నేపథ్యం లో తిరుపతి కార్పొరేషన్ మేయర్ గా శిరీష నియమితులైయ్యారు. ఇక్కడే ఒక ఆసక్తికర విషయం దాగి ఉంది. అది ఏంటంటే మామ పనిచేసిన చోట కోడలు మేయర్ గా ఉన్నత పదవిలో ఆసీనులై ఉండటం.
శిరీష మామ పేరు మునెయ్య తిరుపతి మున్సీపాలిటి లో అటెండర్ గా పనిచేసారు. ప్రస్తుతం ఆ ఉద్యోగం నుండి రిటైర్ అయ్యారు. మున్సిపాలిటీ నుండి నగర కార్పొరేషన్ స్థాయికి ఎదిగిన తిరుపతి లో మొన్న తొలిసారి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరపున అభ్యర్థికి నిలుచున్న శిరీష ఘన విజయం సాధించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఇప్పుడు మామ పనిచేసిన చోటే శిరీష ఉన్నత పదివికి చేపడుతున్నారు.
తాను అటెండర్ గా పనిచేసిన చోట మేయర్ గా తన కోడలు ఎంపిక అవడం పట్ల మునెయ్య సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక మునెయ్య కుటుంబం విషయానికి వస్తే ఆయనకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడి భార్యే ఈ శిరీష. శిరీష ఒక డాక్టర్. ఆమె తిరుపతి లోని ఎస్వీ కళాశాలలో ఎంబీబీస్ విద్యనభ్యసించి, కుప్పం మెడికల్ కాలేజీ నుండి డీజీవో హోదాను సంపాదించారు. మునెయ్య పెద్ద కుమారుడు కూడా ఒక డాక్టర్ కావడం విశేషం. అయన ప్రస్తుతం వైష్ణవి చిన్నపిల్ల ఆసుపత్రి నిర్వహిస్తున్నారు శిరీష మేయర్ కాకముందు అదే ఆసుపత్రిలో భర్తతో కలిసి ప్రజలకి వైద్య సేవలు అందించారు.
డాక్టర్ టూ మేయర్ ఈ ప్రయాణం చాలా దూరమైనది. ఒక డాక్టర్ కి తెలుసు ప్రజల కష్టాలకు కారణాలు ఏంటో,మరియు వాటిని పరిష్కారించాలంటే ఏమి చేయాలో కూడా డాక్టర్లకు తెలుసు అంటారు. అదే విధంగా డాక్టర్ అయిన శిరీష మేయర్ హోదాలో ఉంది మరి ప్రజల సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారో వేచి చూద్దాం.