ఒకరి జీవితంలో వెలుగులు నింపిన ఫేస్ బుక్ పోస్ట్. ఇంతకీ ఆ పోస్ట్ చేసిన మేలేంటో తెలుసా?

Mamatha Reddy
ఫేస్ బుక్ ఒక జీవితాన్ని నిలబెట్టింది. ఒక అమ్మాయి జీవితాన్ని నరకంలోంచి బయటపడేలాచేసింది. ఇంతకీ ఆ అమ్మాయికి చేసిన మేలేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుసుకుందాం.
మనదేశంలో బాల్య వివాహాలు జరపకుండా చట్టాలు తీసొకొచ్చిన ఎక్కడో ఒక చోట ఇప్పటికి జరుగుతూనే ఉన్నాయి. ఆలా రాజస్థాన్ కు చెందిన సుశీల బిష్ణోయ్ అనే యువతికిని పన్నెండోవ యేటనే వివాహం జరిగింది. తన భర్త పేరు నరేష్. అయితే సుశీల కి 18  సంవత్సరాలు వచ్చేవరకు తన పుట్టింటోనే ఉంచారు. ఎప్పుడైతే సుశీల కి 18 సంవత్సరాలు వచ్చాయో ఆమెను తల్లితండ్రులు తనను తన అత్తవారింటికి వెళ్ళమని  ఒత్తిడి తెచ్చారు. సుశీల తన తల్లితండ్రుల ఒత్తిడి మేరకు ఆమె అలాగే తన అత్తవారింటికి వెళ్ళింది.
అయితే చిన్న వయసులో పెళ్లి జరిగిన కారణంగా పెళ్లి అయ్యాక వచ్చే ఇబ్బందులను  సుశీల ఎదురుకోలేక పోయింది. ఈ క్రమంలో ఆమె 2016  వ సంవత్సరం లో తన అత్తవారింటి నుంచి బయటకు వచ్చేసింది. బాల్య వివాహాల నుండి బయటకు వచ్చే వారికీ సహాయం చేయడం కోసం రాజస్థాన్ రాష్ట్రంలో సారథి ట్రస్ట్ అని ఉండేది. ఈ ట్రస్ట్ ను నడిపే వ్యక్తిని సుశీల కలిసింది. అయితే సుశీల తన పెళ్లి రద్దు చేయడం కోసం సాక్షం చెప్పమని తన బంధువులని, స్నేహితులని అడగగా ఎవరు ముందుకు రాకపోయేసరికి తీవ్ర నిరాశకి గురిఅయ్యింది. అప్పుడు తనకి ఫేస్ బుక్  గుర్తుకు వచ్చింది. అందులో భాగంగా నరేష్ తన ఫేస్ బుక్ టైం లైన్ లో వారి  పెళ్లి ఫోటోలు  ఉండటం చూసింది.
ఆలా ఫేస్ బుక్ లో దొరికిన ఫోటోలను సాక్ష్యాలుగా సుశీల కోర్ట్ ముందు ఉంచింది. ఆలా 2017 సెప్టెంబర్ లో జోధ్ పూర్ కోర్ట్ వారి పెళ్లిని రద్దు చేసింది. ఫేస్ బుక్ ఆలా సుశీల జీవితాన్ని నిలబెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: