అమెరికా సహా 15 దేశాల ప్రభుత్వాల్లో 200 మంది భారత సంతతి నేతలదే హవా.

Mamatha Reddy
మనదేశంలో యువత చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్తుంటారు . కొందరయితే అక్కడికి వెళ్లి ఉన్నత చదువులు చదువుకుంటారు. విద్యాభ్యాసం తర్వాత పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించిన వాళ్లు చాలా మందే ఉన్నారు.  కొందరయితే సొంతంగా వ్యాపారాలు చేస్తూ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు. మరికొందరు సాఫ్ట్ వేర్ కంపెనీల్లో మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీలకు సీఈవోలుగా పనిచేస్తున్న వారు ఉన్నారు.  ఇలా వివిధ రంగాల్లో పనిచేస్తూ మన భారతదేశం కీర్తిని నలుమూలలా చాటి దేశ ప్రతిష్టను పెంచారు.
కొంతమంది భారతీయులు విదేశాల్లో రాజకీయాల్లో సైతం రాణిస్తున్నారు. పలు కీలక పదవుల్లో ఆయా దేశాల రాజకీయాలను శాసిస్తున్నారు. ఆ దేశాల ప్రభుత్వాల్లో కీలక స్థానాల్లో పనిచేస్తున్నారు. ప్రపంచ దేశాల్లోని ప్రభుత్వాల్లో భారత సంతతి వ్యక్తులు ఎవరున్నారు.. ఎంత మంది ఉన్నారో తెలియజేసేందుకు ఇండియా స్పోరా అనే సంస్థ పరిశోధనలు చేసింది. ఇండియ స్పోరా అనే సంస్థ అమెరికా కేంద్రంగా పనిచేస్తోంది. ఈ సంస్థ ప్రపంచ దేశాల్లో భారత సంతతి నాయకులు-2021 పేరుతో ఓ నివేదికను తయారు చేసింది. ఆ జాబాతా వివరాలను వెల్లడించింది.

సర్వే వివరాల ప్రకారం ప్రపంచంలోని 15పైగా దేశాల్లో భారతీయులు తమ సత్తా చాటారు.  200 మందికి పైగా భారత సంతతి నేతలు ఆయా దేశాల ప్రభుత్వాల్లో కీలక స్థానాల్లో ఉన్నారని సర్వేలో తేలింది. వీరిలో 60 మంది కేబినెట్ హోదాలో ఉన్నారు. ఆ నేతలకు సంబంధించిన పూర్తి జాబితాను ఇండియా స్పోరా విడుదల చేసింది. వివిధ దేశాల్లో డిప్లొమాట్స్, లెజిస్లేటర్స్, సెంట్రల్ బ్యాంక్ అధినేతలు, న్యాయ విభాగంలోని ప్రముఖులకు ఈ జాబితాలో చోటు దక్కింది. ఈ నివేదికలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా ఉన్నారు. భావి తరాలకు ఈ నేతలు దిక్సూచిలా ఉంటారని, భారత సంతతి పౌరులకు ఈ జాబితాలోని నేతలు రోల్ మోడల్ అని ఇండియా స్పోరా వ్యవస్థాపకుడు ఎం ఆర్ రంగస్వామి  తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: