అమ్మ: గర్భిణీలు వెల్లుల్లి రసాన్ని తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..!?

N.ANJI
గర్భధారణ సమయంలో మహిళలు అనేక ఒత్తిళ్లకు గురవుతుంటారు. ఇక గర్భిణీలు తీసుకునే ఆహారంపైనే బిడ్డ ఎదుగుదల ఉంటుంది. అయితే గర్భిణీలు వెల్లులి రసాన్ని తీసుకోవడం మంచిదేనా అనే సందేహాలు ఉంటాయి. ఇక వెల్లుల్లి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని మనందరికీ తెలుసు. ఇక ఆహార పదార్థాలకు రుచిని మన శరీరానికి ఆరోగ్యాన్ని అందించే వెల్లుల్లిని అద్భుత ఔషధమని చెప్పొచ్చునని నిపుణులు చెబుతున్నారు.
ఇక తురిమిన వెల్లుల్లి పాయలను తేనెతో కలిపి పరిగడుపున తీసుకోవడం వల్ల మన శరీర రోగనిరోధక వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. వెల్లుల్లిపాయల రసాన్ని ఉదయం తాగడం వల్ల చర్మం కూడా కాంతివంతంగా తయారవుతుంది. కడుపుబ్బరం తగ్గాలన్నా ఉదయంపూట వెల్లుల్లి తినాలని వైద్యులు నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లిలో విటమిన్ సీ అధికంగా ఉండటం వల్ల నోటికి సంబంధించిన వ్యాధులన్నీ కూడా తగ్గిపోతాయి. దగ్గు, జలుబు, తుమ్ములు, అలర్జీలతో సతమతమయ్యేవారికి వెల్లుల్లి మంచి మెడిసిన్. వెల్లుల్లి రసంలో యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ఉండడం చేత అలర్జీలను తరిమికొడుతుంది. రక్తపోటుతో బాధపడేవారు వెల్లుల్లి రసాన్ని తీసుకోవచ్చు
అంతేకాక వెల్లుల్లిలో గంధక రసాయనాలు పెద్దమెుత్తంలో ఉంటాయి. వెల్లుల్లిని వేయించి తీసుకోవడం కంటే ఉడికించి తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిది. పురుగు కాటుకు వెల్లుల్లి దివ్యౌషధంగా, విషానికి విరుగుడుగా పనిచేస్తుంది. వెల్లుల్లి రసంలో నిమ్మరసాన్ని కలిపి చర్మ సమస్యలున్న ప్రాంతాలపై రాస్తే ఉపశమనం పొందవచ్చును. దీని వాసన పడనివారు వెల్లుల్లితో టమోటా, ఉల్లిపాయతో సూప్‌లా తయారుచేసి తీసుకోవచ్చును.
 
వెల్లుల్లి రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగపడుతుంది. జ్వరాల నుండి త్వరగా కోలుకోవడానికి వెల్లుల్లిరసాన్ని తేనెలో కలిపి తీసుకుంటే మంచిది. దీనిలో యాంటీ బయాటిక్‌గా, యాంటీ వైరస్‌గా పనిచేయడానికి ఈ గంధకమే కారణం. ఇది జీర్ణ వ్యవస్థను శుద్ధిచేస్తుంది. ఆస్తమాను, జలుబును, దగ్గును నివారిస్తుంది.
 
దురదకు, పగుళ్ళకు, చర్మ సంబంధిత వ్యాధులను నివారిండానికి వెల్లుల్లి దివ్యమైన ఔషధం. నోటిపూతను తగ్గిస్తుంది. రక్తంలో పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది. దీర్ఘకాలిక జ్వరాలకు త్వరితంగా ఉపశమనం కలిగిస్తుంది. గర్భిణుల ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచుతుంది. బాలింతలకు పాలు బాగా పడేలా చేస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: