భారత్ లో అబార్షన్లకు అదే కారణం.. తేల్చేసిన శాస్త్రవేత్తలు
అవును.. కడుపులో బిడ్డ కడుపులోనే చనిపోవడానికి వాయు కాలుష్యమే ప్రధాన కారణమని చైనాకు చెందిన పెకింగ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. తాజాగా వారు చేసిన అధ్యయనంలో అవాంఛనీయ అబార్షన్లకు అసలైన కారణం బయటపడింది. గాలిలో పెరుగుతోన్న కాలుష్యమే ఇందుకు ముఖ్య కారణమని తేల్చి చెబుతున్నారు. గర్భంలో బిడ్డ భూమ్మీదికి రాకుండా దాని ఉసురు తీసి, తల్లులకు కడపుకోత మిగుల్చుతోంది వాయు కాలుష్యమేనని వారంటున్నారు.ఈ అబార్షన్ల సమస్య ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉందట. ముఖ్యంగా ఈ సమస్య భారత్ లోనే కాకుండా దక్షిణాసియా దేశాల్లో 29 శాతం ఉందట. ఆయా దేశాల్లో కూడా ఈ అబార్షన్లకు వాయుకాలుష్యమే కారణమని చైనా శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైందట.
గత 16 ఏళ్లలో ప్రతి ఏడాది సగటున 3,49,681 అబార్షన్ల చొప్పున అధికారికంగా నమోడయ్యాయని, ఇక అనధికారికంగా కూడా మరికొన్ని జరిగి ఉండవచ్చని, వీటికి కారణం వాయు కాలుష్యమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.