అమ్మ: గర్భధారణలో సమస్యలు ఎదుర్కొంటున్నారా.. అయితే ఇది మీకోసమే..!?
అయితే కొందరిలో హార్మోనల్ ఇన్ బ్యాలన్స్ కారణంగా కూడా గర్భం ధరించలేక పోవడం, వచ్చినా అది నిలబడక పోవడం జరుగుతుంది. అలాంటి స్త్రీలు ఇప్పుడు చెప్పబోయేది ఒకసారి ఇలా ప్రయత్నం చేస్తే మంచి ఫలితం ఉండవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. దానిగురించి తెలుసుకుందాం..
ఇక రాత్రి నిద్ర ఖచ్చితంగా 8 గంటల పాటు ఉండేలా చూసుకోవడం వలన, ఒత్తిడి తగ్గడంతో పాటు హార్మోన్లు కూడా బ్యాలెన్సింగ్ కూడా జరుగుతుందని సైంటిస్టులుసూచిస్తున్నారు. నమ్మలేక పోతున్నారా ? ఇది నిజం హాయిగా రాత్రి 8 గంటల పాటు నిద్రపోయేస్త్రీలు గర్భవతి అయ్యే అవకాశాలు దాదాపు 91శాతం ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రంతా హాయిగా నిద్రపోయి, ఉదయాన్నే లేదా మధ్యాహ్నం వేళ శృంగారంలో పాల్గొంటే మంచి ఫలితం ఉంటుందని తెలియచేస్తున్నారు.
అంతేకాక వారు దాదాపు 200మంది తో ఇండియా క్విజ్డ్ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న స్త్రీల పై చేసిన పరిశోధన ప్రకారం.. 8 గంటల పాటు నిద్రపోయేవారిలో దాదాపు 44శాతం మంది గర్భం దాల్చారు. 6గంటల పాటు మాత్రమే నిద్రపోయి గర్భం పొందిన వారు 23శాతం మంది ఉన్నారు. బాగా నిద్రపోయే స్త్రీలలో హార్మోన్ల సమతుల్యత బాగుంటుంది,కాబట్టి గర్భధారణ విషయం లో సమస్యలు ఎదుర్కొనే వారు ఇలా ఒకసారి ప్రయత్నించమని వైద్యులు సలహా ఇస్తున్నారు.కేవలం పిల్లల కోసం ప్రయత్నించే స్త్రీలకే కాదు, ప్రతి మనిషి7 నుండి 8 గంటలు హాయిగా నిద్రపోవడం మంచిది అంటున్నారు సైంటిస్టులు.