అమ్మ: డెలివరీ సమయంలో ఈ సమస్య ఉంటే కచ్చితంగా సిజేరియన్ చేస్తారట..!

N.ANJI
బిడ్డకు జన్మనివ్వడం అంటే తల్లికి పునర్జన్మ లాంటిదే. సహజగా డెలివరీ రెండు పద్ధతులల్లో జరుగుతుంది. అత్యవసర పరిస్థితుల్లో నార్మల్ పద్ధతిలో డెలివరీ జరగడం కష్టం అనుకున్నప్పుడు తల్లీ, బిడ్డ ప్రాణాలను రక్షించడానికి సీ సెక్షన్ చేస్తారు. సిజేరియన్ బాగా పాపులర్ అయినా కూడా చాలా మందికి ఇప్పటికీ నార్మల్ డెలివరీ నే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే హాస్పిటల్ నుండి త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు, రికవరీ ఫాస్ట్ గా ఉంటుంది. అయితే సిజేరియన్ ఎప్పుడు చేస్తారో తెలుసుకుందామా.
జనన ద్వారం బిడ్డకి జన్మనివ్వడానికి అనువుగా తెరుచుకోకపోవడం జరుగుతుంది. కవలలు, లేదా ఇంకా ఎక్కువ మంది పిల్లలు ఒకేసారి జన్మించడం. తల్లికి హైబీపీ ఉండడం వలన కూడా ఆపరేషన్ చేస్తారు. బిడ్డ పొజిషన్ నార్మల్ డెలివరీకి అనువుగా లేకపోవడం. బేబీ హార్ట్ పెరిగిపోవడం. ప్లసెంటా సెర్విక్స్ ని కవర్ చేయడం. బేబీ తల పెద్దదిగా ఉండడం. బ్లీడింగ్ మరీ ఎక్కువగా అవ్వడం. బిడ్డ బొడ్డు తాడు కట్ అయిపోవడం, ఇందువల్ల బేబీకి ఆక్సిజెన్ సప్లై జరగదు. తల్లికి ఏదైనా కంటేజియస్ డిసీజ్ ఉండడం. తల్లికి డయాబెటీస్, బీపీ వంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం. తల్లికి మాసివ్ ఫైబ్రాయిడ్ ఉండడం, పెల్విక్ ఫ్రాక్చర్ జరిగి ఉండడం లాంటి కారణాలు సిజేరియన్ కి దారితీస్తున్నాయి. ఇక తప్పని సరి పరిస్థితుల్లో సిజేరియన్ చేసినా, నార్మల్ డెలివరీ కంటే కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది.
ఇక సిజేరియన్ డెలివరీ తరువాత నొప్పి ఉంటుంది. సర్జరీ తరువాత తల్లి కోలుకోవడానికి రెండు నుండి ఆరు వారాల వరకూ పడుతుంది. రెండ వారం నుండీ నొప్పి కొద్దిగా తగ్గు ముఖం పడుతుంది. ప్రెగ్నెంట్ సమయంలో నడవడం వలన బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఫలితం గా బ్లడ్ క్లాట్స్ వంటివి ఏర్పడవు. కాన్స్టిపేషన్, గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా రెడ్యూస్ అవుతాయి. సీ సెక్షన్ తరవాత చాలా మంది కాన్స్టిపేషన్ సమస్యని ఎదుర్కొంటారు. డెలివరీ తర్వాత నీటి వల్ల కాన్స్టిపేషన్ సమస్య కూడా దూరమవుతుంది. ఎనిమిది గ్లాసుల నీరు తాగాలి అని రూల్ పెట్టుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: